ఖమ్మం

మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరాడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(కల్చరల్), మే 25: దేశంలో మైనర్ బాలికలు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలకు వ్యతిరేకంగా, కామాంధులు, హంతకులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ ప్రజా ఉద్యమాలు నిర్మించి పోరాటాలకు సిద్దంకావాలని ప్రగతిశీల మహిళా సంఘం (పిఒడబ్ల్యూ) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కె రమ పిలుపునిచ్చారు. శుక్రవారం స్ధానిక రామనర్సయ్య విజ్ఞానకేంద్రంలో మహిళాసంఘం జిల్లా అధ్యక్షురాలు జి లలిత అధ్యక్షతన మైనర్ బాలికలు,మహిళలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలకు వ్యతిరేకంగా, పోక్సో చట్ట సవరణ ఆర్డినెన్స్‌పై ప్రగతిశీల మహిళా సంఘం(పిఒడబ్ల్యూ), ప్రగతిశీల యువజన సంఘం(పివైఎల్) ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఈ సందర్భంగా కె రమ మాట్లాడుతూ పోక్సో చట్టంలో తీసుకొస్తున్న సవరణలతో అసలు దోషులు శిక్షనుండి తప్పించుకుని, నిర్ధోశులు శిక్ష అనుభవించాల్సి వస్తుందన్నారు. కాశ్మీర్‌లో ఆసిఫాపై జరిగిన దారుణంలో దోశులను శిక్షించడానికి వారు హిందువులా, ముస్లీంలా అని వివక్షత చూపుతున్నారని మండిపడ్డారు. దేశంలో మహిళలపై జరుగుతున్న అనేక అన్యాయాల్లో మోదీ ప్రభుత్వం నేరగాళ్ళకు కొమ్ముకాస్తుందని ఆరోపించారు. మహిళా న్యాయవాది సంధ్యారాణి మాట్లాడుతూ మైనర్ బాలికలు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా మహిళలు చైతన్యంకావాలని, జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలని, ఎదిరించి పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రముఖ కవియిత్రి, రచయిత ఉరిమళ్ళ సునంద మాట్లాడుతూ టీవి సిరియల్స్, మొబైల్ ఫోన్‌ల ద్వారా అసభ్యకరమైన దృశ్యాలను అలవాటు చేసి మైండ్‌సెట్‌ను మారుస్తున్నారని, దుర్మార్గులను ప్రేరేపిస్తున్నారని వీటికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు. ఈ సదస్సులో పివైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సివై పుల్లయ్య, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి జి వెంకటేశ్వరరావు, పివైఎల్ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, ఎస్‌కె లాల్‌మియా, పిఒడబ్ల్యూ జిల్లా కార్యదర్శి సిహెచ్ శిరోమణి, నాయకులు టి ఝూన్సీ, డి శిరీషా, ఎ మంగతాయి, జె భరత్, సరోజిని, పూలమ్మ, స్వరూపరాణి, చైతన్య, శివలక్ష్మి, ముత్తమ్మ, జగన్, ఛాయ, డి లక్ష్మణ్, దేవా, ప్రేమ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.