ఖమ్మం

రచ్చకెక్కిన వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మే 25: ఖమ్మం కార్పొరేషన్‌లో వివాదం రచ్చకెక్కింది. కమిషనర్, మేయర్ వ్యవహారశైలిపై గత కొంత కాలంగా ఆగ్రహంగా ఉన్న కార్పొరేటర్లు తమ సమస్య పరిష్కరించకుంటే రాజీనామా చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు 36మంది కార్పొరేటర్లు రహస్యంగా సమావేశమై తమ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించుకున్నారు. ప్రధానంగా మేయర్, కమిషనర్ల విధానాల కారణంగా ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్య పరిష్కరించాలంటూ ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర రోడ్లుభవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కెటిఆర్‌లకు ఫిర్యాదు చేయాలని, ఇప్పటికి సమస్య పరిష్కారం కాకపోతే తమ నేతల పర్యటనలు బహ్కిరించాలని నిర్ణయించినట్లు తెలుస్తొంది. కొంతకాలంలో ఈ విధంగా సమస్య పరిష్కారంకాకపోతే తమ పదవులకు రాజీనామా చేసి పార్టీ కార్యకలాపాలలో మాత్రమే పాల్గొనాలని నిర్ణయించుకున్నారు.
ఖమ్మం కార్పొరేషన్‌లో ఎన్నికలు జరిగిన నాటి నుండే వివాదాలు తలెత్తాయి. టిఆర్‌ఎస్ అధిక స్థానాలు గెలిచినప్పటికి మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయా పార్టీల నుండి గెలిచిన వారు కూడా టిఆర్‌ఎస్‌లో చేరటంతో టిఆర్‌ఎస్ కార్పొరేటర్ల సంఖ్య 43కు చేరింది. ఈ నెల 7లో కాంగ్రెస్ 3, సిపిఎం-2, సిపిఐ 2 స్థానాలు కలిగి ఉన్నాయి. ఆ తరువాత డివిజన్‌లలో జరిగే పనుల్లో తమకు సరైనా ప్రాతినిద్యం కల్పించటంలేదని మేయర్ వ్యవహరశైలి వల్ల ఇబ్బందులు పడుతున్నామని, అనేక సార్లు మంత్రికి, ఇతర నేతలకు ఫిర్యాదులు చేశారు. ఇటీవల జిల్లా పర్యటన కెటిఆర్ వచ్చిన సమయంలో సమీక్ష సమావేశం సమయంలో సమస్యను తెలుపుకునేందుకు ప్రయత్నించినా మంత్రులు అవకాశం కల్పించలేదు. అప్పటి నుండి ఆందోళనగా ఉన్న కార్పొరేటర్లు తమ సమస్యను ఎమ్మెల్యే, మంత్రి దృష్టికి తీసుకువస్తునే ఉన్నారు. సమస్య పరిష్కారం కాకపోవటంతో చివరి ప్రయత్నంగా కార్పొరేటర్‌లంతా ప్రత్యేకంగా సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రహస్య సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు పార్టీ నేతల దృష్టికి కూడా తీసుకువెళ్ళగా తుమ్మలకు సమస్యను తెలిపి పరిష్కరించేలా చూస్తామని, తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని సర్దిచెప్పినట్లు తెలిసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తాము ఈ పదవిలో ఉండి ఉపయోగం లేదని, తమ వ్యక్తిగత ప్రతిష్టను కూడా కొల్పోతున్నామని, వెంటనే మేయర్‌ను మార్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. శని, ఆదివారాల్లో మంత్రి తుమ్మల జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో సమస్యను ఆయన దృష్టికి జిల్లా పార్టీ నేతలు తీసుకువెళ్ళనున్నారు.