ఖమ్మం

ప్రజలను తప్పుదారి పట్టించేందుకే థర్డ్‌ఫ్రంట్ డ్రామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధిర, మే 26: ప్రజలను తప్పుదారి పట్టించేందుకే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ థర్డ్‌ఫ్రంట్ డ్రామా ఆడుతున్నారని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎన్ ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. స్థానిక వర్తకసంఘం కళ్యాణ మండపంలో బిజెపి మధిర నియోజకవర్గ శక్తి కేంద్రాల ఇన్‌చార్జ్‌ల సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు కెసిఆర్ రాజకీయ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతుందని ఇలా పడిపోయినప్పుడల్లా ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ఏదో ఒక నాటకం ఆడుతున్నారని, తాజాగా థర్డ్‌ఫ్రంట్ నాటకాన్ని మొదలు పెట్టాడని ఏద్దేవా చేశారు. థర్డ్‌ఫ్రంట్ బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో చేతులు కలపడం ఖాయమన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలేకపోవడంతో రైతుల నుండి తీవ్ర వ్యతిరేఖత వస్తుడటంతో రైతుబంధు పథకంతో రైతులను మభ్య పెడుతున్నారని విమర్శించారు. ఉద్యమ సమయంలో రాష్ట్రంలో జోన్ల వ్యవస్థ ఎందుకని ప్రశ్నించిన కెసిఆర్ ఇప్పుడు 7జోన్లను ఎందుకు ఏర్పాటు చేశారన్నారు. దేశంలో ప్రధానమంత్రి మోడీ నాలుగు సంవత్సరాల పాలనలో అన్నిరంగాలలో శరవేగంగా అభివృద్ధి చెందిందన్నారు. బిజెపి ప్రభుత్వం చేపట్టిన పథకాల కారణంగానే ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా బిజెపి విజయ ఢంకా మోగించిందన్నారు. 2019ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అత్యధిక స్థానాలు గెలవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి కొండపల్లి శ్రీ్ధర్‌రెడ్డి, గల్లా సత్యనారాయణ, గెంట్యాల విద్యాసాగర్, జ్వాలా నరసింహరావు, చిలివేరు సాంబశివరావు, పాపట్ల రమేష్, డివిఎన్ సోమేశ్వరరావు, రామయోగేశ్వరరావు, రామిశెట్టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.