ఖమ్మం

ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(మామిళ్ళగూడెం), మే 26: కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలలో ముఖ్యమంత్రి కెసిఆర్ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. నాలుగేళ్ళ పరిపాలనలో మోదీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏఐసిసి అధ్యక్షుడు రాహులగాంధీ పిలుపుమేరకు శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విశ్వాస ఘాతుక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా పరిషత్ సెంటర్ నుండి ధర్నాచౌక్ వరకు నిర్వహించిన ర్యాలీలో పొంగులేటి సుధాకర్‌రెడ్డి రిక్షా తొక్కారు. అనంతరం పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ నోట్ల రద్దు ప్రజలను మోసం చేసిందన్నారు. నోట్ల రద్దుతో ప్రజలకు మేలు జరగకపోగా 2లక్షల కోట్ల రూపాయలను, నాన్ పర్ఫామెన్స్ ఫండ్‌ను కార్పొరేట్ సంస్థలకు రద్దుచేసి పేద, మద్య తరగతి ప్రజలను మోసం చేసిందన్నారు. మోడి పాలనలో దేశంలో రోజురోజుకు మహిళలపై హత్యలు, హత్యాచారాలు పెరుగుతున్నాయన్నారు. అప్రజాస్వామిక విధానాలతో ప్రజలను అబాస్‌పాలు చేసిందన్నారు. బిజెపి పాలనలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ నియంతృత్వ పాలన కొనసాగుతుందన్నారు. రైతుబంధు పథకం ఓట్లబంధు పథకంగా మార్చుకొని రైతులను అబాసుపాలు చేశారన్నారు. జిల్లాలో రైతులు గిట్టుబాటు ధర అడిగిన నేరానికి రైతులకు సంకెళ్ళు వేసి జైలుకు పంపించిన ఘనత కెసిఆర్‌కే దక్కిందన్నారు. రానున్న ఎన్నికల్లో కేంద్రంలో మోడి, రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వడ్డెబోయిన నరసింహారావు, కొత్తా సీతరాములు, దాసరి దానియేలు, ఫజల్, రామిశెట్టి మనోహర్‌నాయుడు, బండి మణి, రాపర్తి శరత్‌కుమార్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.