ఖమ్మం

ఉత్సవ విగ్రహాలుగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధిర, మే 26: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉత్సవ విగ్రహాలుగా మారారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, మధిర శాసన సభ్యుడు మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. మండల పరిధిలోని ఆత్కూరు గ్రామంలో 5లక్షలతో నిర్మించనున్న సిసిరోడ్డుకు శనివారం ఆయన శంఖుస్థాపన చేశారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మన ఊరు మన ప్రణాళిక, గ్రామ జ్యోతి పథకాలతో స్థానిక ప్రజాప్రతినిధులు తమ గ్రామాలను, అభివృద్ధి చేసుకోవచ్చుననే ఆశతో సుమారు 2.5కోట్లతో ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి పంపించారన్నారు. మరికొద్ది రోజుల్లో సర్పంచ్‌ల కాలపరిమితి పూర్తి కావస్తున్నప్పటికీ ప్రభుత్వం నిధులు మంజురు చేయకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయన్నారు. స్థానిక శాసన సభ్యుడిగా పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి సహకరిస్తానని ఆయన ఈ సందర్భంగా హామీనిచ్చారు. ఆత్కూరు గ్రామం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి చేయడం జరిగిందని, విద్యాభివృద్ధి కోసం ఖాజీపురంలో పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జాలిముడి ఎడమ కాలువ ద్వారా మధిర మండల పరిధిలోని దెందుకూరు వరకు సాగునీరు అందిస్తామన్నారు.
కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ
మండల పరిధిలోని 92మందికి మంజూరయిన కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ 64,26,052లక్షల రూపాయల చెక్కులను స్థానిక తహశీల్ధార్ కార్యాలయంలో మల్లు భట్టి విక్రమార్క లభ్ధిదారులకు అందజేశారు. అనంతరం తహశీల్ధార్ కార్యాలయాన్ని ఆయన పరిశీలించి ఆన్‌లైన్ పనితీరును అక్కడి ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహశీల్ధార్ మంగీలాల్, ఎంపిడిఓ పి ఆల్బర్ట్, ఎంపిపి వేమిరెడ్డి వెంకట్రావమ్మ జడ్పీటిసి మూడ్ ప్రియాంక, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, కాంగ్రెస్, టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.