ఖమ్మం

అనుమతుల్లేకుండా అడవుల్లో సంచరించొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూలూరుపాడు, మే 26: అడవుల్లో అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా సంచరించే వ్యక్తులపై శాఖాపరమైన చర్యలు తప్పవని స్థానిక రేంజ్ అధికారి బి నాగసాయి ప్రసాద్ స్పష్టం చేశారు. స్థానిక రేంజి కార్యాలయంలో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. రేంజి పరిధిలోని పాపకొల్లు, రాజారావుపేట, గుండెపూడి సెక్షన్ అటవీ ప్రాంతాల్లోని అడవుల సరిహద్దు గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. కనీస అవసరాల కోసం అడవుల్లోకి వెళ్లే వారి పట్ల ఆలోచిస్తామని, కానీ అటవీ ప్రాంతంలో చెట్లను నరకటం, మట్టి, రాళ్లను తరలించటం వంటి చర్యలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదన్నారు. ఇంతే కాకుండా కొందరు అడవుల్లో బీడి, చుట్ట, సిగరెట్‌లను కాల్చివేయటం వలన వేసవిలో ఎండిరాలిన ఆకులకు నిప్పంటకుని మంటల చెలరేగే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని అడవుల్లో ఇష్టారాజ్యంగా తిరిగే వారి పట్ల దృష్టి సారించామని తెలిపారు. వేసవికాలంలో అడవుల్లో నీటి జాడలు లేని ప్రాంతాలను గుర్తించి వన్య ప్రాణుల కోసం రేంజి పరిధిలో 20 చోట్ల నీటి తొట్లను ఏర్పాటుచేసి ట్యాంకుల ద్వారా అవసరమైనప్పుడు నీటిని నింపేదుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సహజంగా అడవుల్లో మంటలు వ్యాప్తి చెందినప్పుడు ఆర్పేందుకు బ్లోయర్‌ను కూడా సిద్ధంగా ఉంచుకున్నామని అన్నారు. వన్య ప్రాణులను వేటాడటం వృత్తిగా చేసుకున్న వ్యక్తులను గుర్తించి వారి పట్ల నిఘాను విస్తుృతం చేసామని తెలిపారు. ఇంతే కాకుండా అడవులను నరికి కలపను తరలించటం, భూములను ఆక్రమించటం వంటి చర్యల పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. వీటి నియంత్రణకై ఇప్పటికే రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకుంటున్నట్లు తెలిపారు. అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలకు కూడా తమశాఖ సిబ్బందికి సహకరించాలని కోరినట్లు తెలిపారు. రాత్రి సమయాల్లో అటవీ ప్రాంతాల్లో సిబ్బందితో పకడ్బంధీగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని, అటవీ ప్రాంత రక్షణకై పటిష్టంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సెక్షన్ అధికారులు రాజేష్, సత్యం, సురేష్, బీట్ అధికారులు విజయ్ కుమార్, విజయ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అద్దె చెల్లింపుల్లో అలసత్వం వద్దు
* ఐటీడీఏ పీవో పమేలా సత్పతి
భద్రాచలం టౌన్, మే 26: భద్రాచలం ఐటీడీఏ పరిధిలో ఇల్లందు, పాల్వంచ, మణుగూరు, భద్రాచలం మండలాల్లో ఐటీడీఏ షాపింగ్ కాంప్లెక్సుల్లో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న నిర్వాహకులు అద్దె చెల్లింపుల విషయంలో అలసత్వం చేయరాదని ఐటీడీఏ ఇన్‌ఛార్జ్ పీవో పమేలా సత్పతి సూచించారు. అద్దె చెల్లించని నిర్వాహకులకు నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. ఐటీడీఏలోని తన చాంబర్‌లో శనివారం షాపింగ్ కాంప్లెక్స్‌ల అద్దె బకాయిలపై ఐటీడీఏ పరిపాలన, ఇంజనీరింగ్ డీఈలు, ఏఈలతో, ఇతర అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యాపారస్తులు ఐటీడీఏ షాపింగ్ కాంప్లెక్స్‌ల ద్వారా వ్యాపార లావాదేవీలు నిర్వహించుకుంటూ అద్దె చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. బకాయిలు లేకుండా అధికారులు అద్దె వసూలు చేయాలని ఆదేశించారు. బినామీలు ఎవరైనా ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వెంటనే ఖాళీ చేయించాలని ఆదేశించారు. సమావేశంలో ఈఈ శ్రీనివాసస్వామి, ఎస్‌వో డేవిడ్‌రాజ్, గణాంకాధికారి సంతోష్, మేనేజర్ ప్రభాకర్, డీఈ శ్రీనివాసరాజు, పాల్వంచ డీఈ రాములు, టీఏ గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.