ఖమ్మం

నడక ఆరోగ్యానికి మంచిది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(ఖిల్లా), జూన్ 17: నడక మానవుని ఆరోగ్యానికి ఎంతో మంచిదని, నడకతో కలిగే లాభాలపై అవగాహన కల్పించాలని ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. లకారం ట్యాంక్‌బండ్ వాకర్స్‌క్లబ్ ఆధ్వర్యంలో పాత్రికేయులకు నిర్వహించిన నిడకపోటీలను ఎంపి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం నడవడం వలన ఆరోగ్య సమస్యలు తెలెత్తవన్నారు. ఉదయం, సాయంత్రం వెసులుబాటును భట్టి ఏదో సమయంలో నడకను అలవాటు చేసుకోవాలని సూచించారు. వాకర్స్‌క్లబ్ కన్వీనర్ యరమళ్ళ సుదర్శనరావు మాట్లాడుతూ 12మెంబర్‌తో లకారం వాకర్స్‌క్లబ్‌ను ఏర్పాటు చేశామన్నారు. నడకపై అవగాహన కల్పించేందుకు ప్రతి నెల స్ర్తిలు, పురుషులకు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తున్నట్లు వెల్లడించారు. నడకతో అనేక లభాలు ఉన్నాయని, ముఖ్యంగా గుండెపై దాని ప్రభావం చూపుతుందన్నారు. మారుతున్న కాలంలో పనివత్తిళ్ళకు గురౌతున్న వారికి నడక ఎంతో ప్రశాంతతను చేకూరుస్తుందన్నారు. తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు నడకను అలవర్చుకోవాలని తద్వారా ఆనారోగ్య సమస్యలను అధిగమించవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు విడాల పుల్లయ్య, టి వెంకటేశ్వరరావు, పి వెంకటేశ్వర్లు, డి హనుమంతరావు, ఎన్ సురేష్‌కుమార్, పి శ్రీనివాసరావు, నాగేంద్రకుమార్, ప్రభాకర్, పాత్రికేయులు రాంనారాయణ, ఆదినారాయణ, ఎన్ వెంకటరావు, ఏనుగు వెంకటేశ్వర్లు, తాళ్ళూరి మురళీకృష్ణ, మాదవరావు, జనార్థనాచారి, పాపారావు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలన్నదే కేసీఆర్ లక్ష్యం
* డాక్టర్ పిడమర్తి రవి
వేంసూరు, జూన్ 17: పోరాడి సంపాదించుకున్న తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ సుపరిపాలన అందిస్తున్నారని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. గ్రామ గ్రామాన ప్రభుత్వ పథకాల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆదివారం భీమవరం, లింగపాలెం, వేంసూరు తదితర గ్రామాల్లో ఆయన పర్యటించి టీఆర్‌ఎస్ పార్టీ జెండాలను ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కృష్ణా, గోదావరి వంటి పలు నధులు ప్రవహిస్తున్నా సాగునీరు కరువైందని పేర్కొన్నారు. వర్షాలకై ఆకాశం వైపు చూడటం తప్పా, మడవ తీసి నీరుపెట్టుకునే పరిస్దితి లేక పోయిందన్నారు. వచ్చీపోయే విద్యుత్‌తో బోరుబావుల నీటితో వ్యవసాయం చేయటానికి ఎంత కష్టపడ్డామో అందరికి తెలిసిందేనన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత బోరుబావులపై ఆధారపడి సాగు చేస్తున్న రైతులకు 24గంటల ఉచిత విద్యుత్ అందించి వ్యవసాయాన్ని పండగలా మార్చే ప్రయత్నం సిఎం కేసిఆర్ చేపట్టారని పేర్కొన్నారు. నాగార్జునసాగర్ కాలువపై ఉన్న ఎత్తిపోతల పథకాలకు పూర్తిగా ఉచిత విద్యుత్ అందిస్తూ, మూలన పడ్డ ఎత్తిపోతల పథకాలకు నిధులు మంజూరు చేసి, సాగునీరు అందించే చర్యలు తీసుకున్న ఘనత సిఎం కేసిఆర్‌దే అన్నారు. వేంసూరు మండలంలోనే రెండు ఎత్తిపోతల పథకాలకు నిధులు మంజూరు కాగా, వేంసూరు రెండవ దశ ఎత్తిపోతల పథకం పూర్తి చేసే పనిని ప్రారంభించిందన్నారు. శంభునిగూడెం ఎత్తిపోతల పథకం పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయని తెలిపారు. దుమ్మగూడెం ఎత్తిపోతల పథకం పూర్తి అయితే ఖమ్మం జిల్లా మరో డెల్టాగా మారటం ఖాయమన్నారు. మన జిల్లాలోనే సాగునీటికి ఎంతటి ప్రాధాన్యత ఇచ్చారో, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్రమం పెద్ద ఎత్తున సాగుతుందన్నారు. పంట పెట్టుబడి కోసం అప్పులు కోసం పరుగులు తీయకుండా ఎకరానికి రూ.8వేల వంతున సహకారం అందిస్తున్న విషయం తెలిసిందేనన్నారు. ఖరీఫ్‌కి గాను రూ.4వేలు చెక్కులను రైతులకు అందుకున్న విషయాన్ని గుర్తుచేశారు. భూప్రక్షాళనతో దాదాపు రైతుల భూములకు ఇబ్బందులు తొలిగిపోయాయని పేర్కొన్నారు. రైతాంగంతో పాటు అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందిస్తూ రాష్ట్రాన్ని దేశానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి కేసిఆర్ పరిపాలనను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన అవసరం ఉందన్నారు. ఈకార్యక్రంలో జిల్లా టీ ఆర్ ఎస్ నాయకులు బండి గుర్నాధరెడ్డి, మండల పార్టీ అద్యక్షులు వెల్ది జగన్మోహనరావు, ఎంపీపి జగన్నాధం, జెడ్పీటీసి భాషా, మందపాటి మహేశ్వరరెడ్డి, మామిళ్ళపల్లి వెంకటేశ్వరరావు, లింగపాలెం ఉప సర్పంచ్ రమేష్, అమ్మపాలెం సొసైటి అద్యక్షులు నాగళ్ళ లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీపి రాచూరి గంగరాజు, టీ ఆర్ ఎస్ మండల నాయకులు వేణుగోపాలరెడ్డి, పెయ్యల యాకోబు, మైసాక్షి వసంతరావు, రహీం, తదితరులు పాల్గొన్నారు.