ఖమ్మం

కస్తూర్బా బాలికల విద్యాలయంలో మంచినీటి కొరత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమలాయపాలెం, జూన్ 18: మండల కేంద్రంలోని కస్తూర్బ బాలికల విద్యాలయంలో మంచినీటి కొరతతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచినీటి కొరతతో మూడురోజులకొసారి విద్యార్థినులు స్నానం చేయాల్సిన పరిస్థితి ఏర్పిడింది. పాఠశాలలో మెత్తం 200మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారు. మూడు నెలల క్రితం వేసిన బోరులో నీటి లభ్యత తక్కువగా ఉండడంతో నీరు మినరల్ వాటర్ తయారు చేయడానికి సరిపోతున్నది. పాఠశాలలో వేసిన గ్రామపంచాయతీ పంపు సరిగ్గా పరిచేయడం లేదు. పాఠశాల ప్రక్కన వ్యవసాయ బావి ఉండగా దాన్ని నెల ప్రాతిపదికన అద్దెకు తీసుకోవడంతో మంచినీరు సరఫరా కాక విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంత్రి నియోజకవర్గంలో నీటి కొరత తీవ్రంగా ఉండడం గమనార్హం. తక్షణమే నీటి సమస్యను పరిష్కరించి పాఠశాలకు మంచినీటి సరఫరాను పునరుద్ధరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
సింగరేణి కార్మికుల ప్రధాన సమస్యలు పరిష్కరించాలి
* మైన్స్, డిపార్టుమెంట్ల వద్ద ఎఐటియుసి ధర్నాలు
కొత్తగూడెం, జూన్ 18: సింగరేణి కార్మికుల ప్రధాన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటియుసి ఆధ్వర్యంలో సోమవారం కొత్తగూడెం ఏరియాలోని మైన్స్, డిపార్టుమెంట్లు, ఓపెన్‌కాస్టుల వద్ద ధర్నాలు చేశారు. అనంతరం వినతిపత్రాలను మేనేజర్లకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వర్కర్స్ యూనియన్ ఆడ్వైజర్ దమ్మాలపాటి శేషయ్య మాట్లాడుతూ గత ఏడాది సింగరేణి సంస్థకు వచ్చిన లాభాల నుండి కార్మికులకు 30 శాతం అందజేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో గుర్తింపు కార్మిక సంఘం విఫలమైందని ఆరోపించారు. ఈ నెల 25వ తేదీన సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు వంగా వెంకట్, రాజేశ్వరి, ధరణి, వీరస్వామి, రాజయ్య, రాములు, శేషగిరి, సముద్రాల సుధాకర్, జక్కుల గట్టయ్య, కృష్ట్ఫార్, గుత్తుల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.