ఖమ్మం

ఎర్రగుంటలో ఇరు వర్గాల ఘర్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్నపురెడ్డిపల్లి, జూన్ 18: మండల పరిధిలోని ఎర్రగుంటలో సోమవారం రెండు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు రావడంతో తొలుత గ్రామ ప్రధాన సెంటర్‌లో రెండు వర్గాలు ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలతో అభిషేకం చేశారు. గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువనేత వేములపల్లి శ్రీనివాస్ (వాసు) హత్యనేపధ్యంలో గ్రామంలో అభివృద్ధి పనులు కుంటుపడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇటీవల గ్రామానికి చెందిన కొందరు ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లును కలిసి గ్రామంలో పర్యటించి అభివృద్ధి పనులు చేయాలని విన్నవించారు. రాజకీయాలకు అతీతంగా గ్రామాలు అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే తాటిని కోరగా ఎమ్మెల్యే రావడానికి సుముఖత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎర్రగుంట ప్రధాన సెంటర్‌లో పార్టీ దిమ్మె నిర్మించి జెండాను ఆవిష్కరించి పాలతో అభిషేకం చేశారు. అందులో భాగంగానే సోమవారం పార్టీ జెండా ఆవిష్కరించిన అనంతరం తంగెలుగుంపు వద్ద కల్వర్టు నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతుండగా రెండు వర్గాలలో కొంతమంది పలు సమస్యలు లెవనెత్తారు. ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిడంతో ఎమ్మెల్యే సహనం కోల్పోయేలా చేశారు. దీంతో ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు సమావేశం మధ్యలోనే వెళ్ళిపోయారు. ఈ క్రమంలో రెండు వర్గాలలో ఎర్రగుంట జాతీయ రహదారిపై తోపులాట జరిగింది. పంచాయతీ ఎన్నికల దృష్ట్యా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో పంచాయతీ ఎవరికి దక్కుతుందో అని జనాలు వేచి చూస్తున్నారు.
పట్టాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం తగదు
భద్రాచలం టౌన్, జూన్ 18: పోడు భూములకు పట్టాలు ఇవ్వడంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోందో చెప్పాలని ఎమ్మెల్యే సున్నం రాజయ్య, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి పోడు సాగు చేస్తూ ఆదివాసీలు జీవనం సాగిస్తుంటే పట్టాలు ఇవ్వకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని వారు ప్రశ్నించారు. 2005కు ముందు పోడుసాగు చేస్తూ సర్వేలు, రీ సర్వేలు చేసిన భూములకు పట్టాలు అతి తక్కువగా ఇచ్చారని, ఎక్కువ మంది పట్టాలు లేకుండా ఉన్నారని వారు అన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో దుమ్ముగూడెం, చర్ల మండలాలకు చెందిన వందలాది మంది పోడుసాగుదారులు సోమవారం ఐటీడీఏ వద్ద ఆందోళన చేపట్టారు. ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సున్నం రాజయ్య మాట్లాడుతూ పోడుసాగుదారులను అటవీ శాఖ అధికారులు నానా రకాల ఇబ్బందులకు గురిచేస్తున్నారని, పోడుసాగుదారుల జోలికొస్తే సహించేది లేదన్నారు. గిరిజనులను భయభ్రాంతులకు గురిచేస్తూ అటవీ శాఖ అధికారులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఆ పద్ధతి మానుకోవాలని, వారి జోలికి రావొద్దని ఎమ్మెల్యే హెచ్చరించారు. పోడు పోరాటం ఆగదని, భవిష్యత్‌లో పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని అనేక పోరాటాలు, ఉద్యమాలు ఉద్ధృతం చేస్తామన్నారు. అనంతరం డీడీ రామ్మూర్తికి వినతిపత్రం అందజేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో సీపీఎం నేతలు యలమంచి రవికుమార్, అన్నవరపు కనకయ్య, మచ్చా వెంకటేశ్వర్లు, అన్నవరపు సత్యనారాయణ, కె.పుల్లయ్య, వంశీకృష్ణ, ఎంపిపి తెల్లం సీతమ్మ, మర్మం చంద్రయ్య, సరియం కోటేశ్వరరావు, చంటి, రాజమ్మ, చిలకమ్మ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.