ఖమ్మం

ఆర్థిక స్వావలంబన దిశగా మహిళా సంఘాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జూన్ 18: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా ఆర్థిక స్వావలంబన సాధిస్తూ మహిళా సంఘాలు కొత్త ఒరవడిని సృష్టిస్తున్నాయి. కేవలం సంఘాల ఏర్పాటుతోపాటు పొదుపు చేసుకుని లబ్ధిపొందటమే కాకుండా ప్రభుత్వం ఇచ్చే అవకాశాలను వినియోగించుకుంటూ ఆర్థికంగా మహిళలు మరింత బలోపేతం అవుతున్నారు. ప్రధానంగా ధాన్యం కొనుగోళ్లలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన మహిళా సమాఖ్యలు ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలోనే నిలిచారు. ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి అధికారుల సహకారంతో ఈ రబీ సీజన్‌లో రెండు జిల్లాల పరిధిలో 27 కొనుగోలు కేంద్రాల ద్వారా రూ 49కోట్లు విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ప్రభుత్వం వీరికి క్వింటాకు రూ 32లు చొప్పున కమిషన్ ఇస్తుండటంతో కొనుగోలు చేసిన ధాన్యంపై రూ 96 లక్షల ఆదాయాన్ని సమకూర్చుకున్నారు. ఖమ్మం జిల్లాలో 17కొనుగోలు కేంద్రాల ద్వారా 10 మండలాల పరిధిలో రూ 43.12కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ 84.50లక్షల ఆదాయాన్ని సమకూర్చుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5 మండలాల పరిధిలో 10కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి రూ 6కోట్లు విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ 11.47లక్షల ఆదాయాన్ని సమకూర్చుకున్నారు. 2007 నుంచి ఈ తరహా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా ఇంత పెద్ద మొత్తంలో వ్యాపారం జరగటం ఇదే ప్రధమం. జిల్లాలోని కల్లూరు మండలం పుల్లయ్య బంజర కొనుగోలు కేంద్రంలో మల్లిక గ్రామ సమాఖ్య ఆధ్వర్యంలో 390 మంది రైతుల నుంచి 48వేల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసి కమీషన్ రూపంలో రూ 15.37లక్షలు సంపాదించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతమైన పినపాక మండలంలో 19వేల బస్తాల ధాన్యాన్ని కొనుగోలు చేయటం గమనార్హం. ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి మండలంలోని సదాశివపురం, క్రిష్టారం, వేంసూరు మండలంలోని అడసర్లపాడు, కల్లూరు మండలంలోని పుల్లయ్య బంజర, కొర్లగూడెం, కప్పలబంధం, పెనుబల్లి మండలంలోని కుప్పెనకుంట్ల, కొండ్రుపాడు, కొణిజర్ల మండలంలోని పెద్ద మునగాల, ముదిగొండ మండలంలోని గోకినేపల్లి, మేడేపల్లి, ఎడవల్లి, నేలకొండపల్లి మండలంలోని ముఠాపురం, చెరువుమాదారం, వైరా మండలంలోని సిరిపురం, కూసుమంచి మండలంలోని కూసుమంచి, పాలేరులలో కేంద్రాలను ఏర్పాటుచేసి కొనుగోళ్లు జరిపారు. గత ఖరీఫ్ సీజన్‌లో రూ 750కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసిన సంఘాలు, రబీ సీజన్‌లో రూ 49కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేయటం గమనార్హం. వచ్చే ఖరీఫ్, రబి సీజన్‌లలో రెండు జిల్లాల పరిధిలో అత్యధికంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే మహిళా సంఘాలు కొనుగోలు చేసిన ధాన్యంలో అధికంగా గ్రేడ్ ఎ రకం ధాన్యానే్న కొనుగోలు చేయటంతో వాటిని తిరిగి జిల్లాలోని వసతి గృహాలు, ప్రభుత్వ పాఠశాలకు సరఫరా చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ధాన్యం సేకరణ సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురైన అధిగమించామని, ఆ సమయంలో ఆకాల వర్షంతో నష్టం జరుగుతుందేమోనని భయపడ్డామని, కాని మహిళలు ధైర్యంతో ముందడుగు వేసి ప్రథమ స్థానంలో నిలిచారని ఖమ్మం జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి ఇందుమతి తెలిపారు. వచ్చే ఖరీఫ్ సీజన్‌లో మరింత అధికంగా సేకరణ జరిపి ఎక్కువ మంది మహిళలకు లబ్ధి జరిగేలా ప్రణాళిక రచిస్తున్నామన్నారు. అలాగే వచ్చే సీజన్‌లో జిల్లాలోని అన్ని ప్రాంతాలలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేసేలా చూస్తామన్నారు.
ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

* కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్
ఖమ్మం(మామిళ్ళగూడెం), జూన్ 18: గ్రీవెన్స్‌డేలో ప్రజలనుండి వచ్చిన వినతి పత్రాలను పరిశీలించి వెంటనే వాటికి పరిష్కారమార్గాలు చూపాలని కలెక్టర్ డిఎస్ లోకేష్‌కుమార్ జిల్లా అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌డేలో ప్రజలనుండి కలెక్టర్ వినతిపత్రాలను స్వీకరించారు. రామన్నపేట గ్రామం పరిధిలో మల్లెమడుగు పెద్దచెరువుకు సంబంధించిన సర్వేనెంబర్ 119లోగల 118 ఎకరాల భూమిని కైకొండాయిగూడెం గ్రామానికి చెందిన నాగటి నరసింహ కుటుంబ సభ్యులు కబ్జాచేసి మట్టిని యధేచ్ఛగా విక్రయించుకుంటున్నారని వారిపై తగు చర్యలు తీసుకోవాలని మల్లెమడుగు పెద్దచెరువు ఆయకట్లు రైతులు కలెక్టర్‌కు విన్నవించారు. రేషన్ డీలర్లకు గౌరవ వేతనం ఇవ్వాలని డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ జిల్లా రేషన్ డీలర్‌లు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం దళిత కుటుంబాలకు ఇచ్చిన సర్వేనెంబర్ 1099/27లో 18 ఎకరాల అసైండ్ భూమికి పాస్‌పుస్తకాలు ఇప్పించాలని నేలకొండపల్లి మండలం చెరువుమాదారం గ్రామానికి చెందిన దళిత రైతులు కలెక్టర్‌కు విన్నవించారు. తమ వ్యవసాయ భూమిలో బోర్లు వేయించి విద్యుత్ మోటార్లు బిగించాలని బోనకల్లు మండలం బీరోలు గ్రామానికి చెందిన వి నాగమ్మ, టి నాగమ్మ, మల్లమ్మ అనే దళిత మహిళారైతులు కలెక్టర్‌కు విన్నవించారు. 12సంవత్సరాల వయస్సుగల తన చిన్నారి పూర్తిగా వికలాంగురాలై మంచానికి పరిమితమైందని తమను ఆదుకోవాలని ముదిగొండ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన నిరుపేద దంపతులు గంటా నాగేశ్వరావు, రాణి కలెక్టర్‌ను వేడుకొన్నారు. ఈ కార్యక్రమంలో అర్భన్, రూరల్ తహసీల్దార్లు శ్రీలత, నరసింహారావులు పాల్గొన్నారు.