ఖమ్మం

వంటావార్పుతో రేషన్ డీలర్ల నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్లూరు, జూన్ 19: తెలంగాణరాష్ట్ర రేషన్ డీలర్ల పిలుపు మేరకు కల్లూరు, పెనుబల్లి మండలాలకు చెందిన రేషన్ డీలర్లు తమ సమస్యల పరిష్కారాన్న కోరుతూ వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఇరు మండలాలకు చెందిన డీలర్లు మాట్లాడుతూ డీలర్ల వృత్తిలో ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ తాము మాత్రం నష్టాలపాలౌతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఇతర రాష్ట్రాలు డీలర్లకు అందిస్తున్న కమీషన్‌ను తెలంగాణ ప్రభుత్వం కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. డీలర్లకు కనీస వేతనం కల్పించాలని, ఉధ్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రెండు మండలాలకు చెందిన రేషన్ డీలర్లు పాల్గొన్నారు.

బీఎల్‌ఎఫ్ పాలేరు నియోజకవర్గ కార్యాలయం ప్రారంభం
ఖమ్మం రూరల్, జూన్ 19: స్థానిక వరంగల్ క్రాస్‌రోడ్‌లో ఏర్పాటు చేసిన పాలేరు నియోజకవర్గ బిఎల్‌ఎఫ్ కార్యాలయాన్ని మంగళవారం పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ నున్నా నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న స్ధానిక సంస్థల ఎన్నికల్లో బిఎల్‌ఎఫ్ తన సత్తాను చాటాలని, జిల్లాలో మెజార్టీ గ్రామపంచాయతీలు, ఎంపిటిసిలను కైవసం చేసుకుంటామన్నారు. 2019 ఎన్నికల్లో 119 స్థానాల్లో బిఎల్‌ఎఫ్ పోటీ చేయనున్నట్టు తెలిపారు. బిఎల్‌ఎఫ్ అధికారంలోకి వస్తే బిసిని ముఖ్యమంత్రిని చేస్తామన్నారు. బిసిలకు అసెంబ్లీ ఎన్నికల్లో 60 స్థానాలు ఇస్తామని, కాంగ్రెస్, టిఆర్‌ఎస్ పార్టీలు బిసిలకు 60 స్థానాలు కేటాయించే సత్తా ఉందా అని ఆయన ప్రశ్నించారు. బిఎల్‌ఎఫ్ కార్యాలయాన్ని కేంద్రంగా చేసుకొని పోరాటాలను ఉధృతం చేయాలిని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బిఎల్‌ఎఫ్ నియోజకవర్గ కన్వీనర్ బండి రమేష్, నాయకులు సంజీవరెడ్డి, నండ్ర ప్రసాద్, తుమ్మల శ్రీనివాస్, పి సంగయ్య, వెంకయ్య, ఎ నర్సయ్య, నాగేశ్వరరావు, మల్సూరు, సుగుణమ్మ, అనిల్, మోహన్‌రావు, కొమ్ము శ్రీను తదితరులు పాల్గొన్నారు.