ఖమ్మం

గిరిజనుల భూములకు రక్షణ కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(జమ్మిబండ), జూన్ 19: సత్తుపల్లి మండలం చెరుకుపల్లి గిరిజన పోడుసాగు దారులపై ఫారెస్టు అధికారుల దాడులను అరికట్టి వాటికి రక్షణ కల్పించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించి డిఆర్వోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ 1996కు ముందు చెరుకుపల్లి గ్రామంలో 80కుటుంబాలు అటవీభూములను సాగుచేసుకుంటు జీవిస్తున్నారన్నారు. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం వారందరికి పట్టాలు ఇవ్వాలన్నారు. స్థానిక అధికారుల నిర్లక్ష్యం వల్ల జిల్లాలో వేలాది ఎకరాల పోడుభూములు సర్వేకు నోచుకోలేదని, చెరుకుపల్లి భూములను సర్వేచేయక పోవడంతో పట్టాలు ఇవ్వలేదన్నారు. దీనిపై అనేకసార్లు గిరిజనులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ప్రయోజనం లేకుండపోయిందన్నారు. హరితహారం పేరుతో ఫారెస్టు అధికారులు బలవంతంగా మొక్కలు నాటడంతో పాటు గిరిజనులపై అక్రమకేసులు బనాయిస్తున్నారన్నారు. అటవీభూముల సమస్యను సత్వరమే పరిష్కరించి అర్హులైన గిరిజనుల భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. గిరిజనులకు అండగా సిపిఐ పోరాడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సింగు నర్సింహరావు, నాయకులు ఆదినారాయణ, గడ్డం రాములు, కృష్ణయ్య, తెల్లం రాజన్న, తాటి వీరన్న, వీరస్వామి, రాజు తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మంలో ఘనంగా రాహుల్ జన్మదిన వేడుకలు
ఖమ్మం(మామిళ్ళగూడెం)జూన్ 19:: ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాహుల్‌గాంధీ 48వ జన్మదిన వేడుకలను జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు ఒకరికొకరు అభినందనలు తెలుపుకుంటూ స్వీట్లు పంచిపెట్టారు. ఈ వేడుకలను పురస్కరించుకొని తొలుత ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి భారీకేక్‌ను కట్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ ఎఐసిసి అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీని మరింత ముందుకు తీసుకుపోతున్నారన్నారు. యువనేత రాహుల్‌ను ప్రధానిని చేయడమే ముందున్న కర్తవ్యంమన్నారు. 2019ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాపర్తిశరత్, రాంశెట్టి మనోహర్‌నాయుడు, షేక్ జహీర్, వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.