ఖమ్మం

తెలంగాణా వ్యవసాయ బడ్జెట్ 35వేల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖానాపురంహవేలి, జూన్ 19: తెలంగాణ రాష్టవ్య్రవసాయ బడ్జెట్ 35వేల కోట్లరూపాయలని రాష్టవ్య్రవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావులు వెల్లడించారు. మంగళవారం స్థానిక ఎస్‌అర్ గార్డెన్స్‌లో రైతు సమన్వయ సమితి జిల్లా సమన్వయకర్త నల్లమల వెంకటేశ్వరావు అధ్యక్షతన జరిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు, వ్యవసాయశాఖ ఆధికారులకు రైతుకు సామూహిక బీమా పథకంపై అవగాహన సదస్సుకు ముఖ్యఅతిధులుగా హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వార్షిక బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిన ఘనత ముఖ్యమంత్రి కెసిఅర్‌కు దక్కుతుందన్నారు. కోటి 50లక్షల ఎకరాల భూమిలో రైతులు మంచిగా కష్టపడి పనిచేస్తే ఒక లక్షా 25వేల కోట్ల రూపాయల పంటల దిగుబడి సాధించడం ద్వారా దేశంలో తెలంగాణా నెంబర్ వన్ రాష్ట్రంగా నిలుస్తుందన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు సంఘం లేక పోవడం వలనే దళారుల చేతిలో మోసపోతున్న రైతులను సంఘటితం చేసేందుకు కేసిఅర్ రైతుసమన్వయ సమితులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 1లక్షా68వేల మంది రైతు సమన్వయ సమితి సభ్యులు, 2,638మంది ఎఇఒలు, 280మంది ఎఒలు, 200మంది ఎడిఎలు, 30మంది జెడిఎలు రైతులు విత్తనం వేసిన దగ్గర నుండి పంట దిగుబడి ఇంటికి వచ్చే వరకు అండదండగా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. 57లక్షలమంది రైతులకు రైతుబంధు పథకం ద్వారా 5వేల కోట్లరూపాయలను వెచ్చించిన ఘనత ముఖ్యమంత్రి కేసిఅర్‌కు దక్కుతుందన్నారు. రైతుబంధు పథకం ద్వారా 98.24 శాతం సన్న, చిన్నకారు రైతులు లబ్దిపొందినట్లు తెలిపారు. 25ఎకరాల పైబడిన రైతులు 6,488మంది (0.11%)మాత్రమే లబ్దిపొందటం జరిగిందన్నారు. దీన్ని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. రైతుబంధు లబ్దిదారులకు ఆగస్టు 15నుండి ఎలా మరణించినా 5లక్షల రూపాయలు నామినీకి 10రోజులలోపు చెల్లింపుచేయడం జరుగుతుందన్నారు. ఈ పథకం అమలు చేసేందుకు ఒక్కొక్క రైతు పేరున 2,271రూపాయలను తమ ప్రభుత్వం ఎల్‌ఐసికి చెల్లించడం జరుగుతుందని వివరించారు. రైతు బీమాను జూన్ 30లోగా పూర్తిచేసి, జూలై 15లోగా ఎఇఒలు డేటాను నిక్షిప్తంచేసి ఎల్‌ఐసికి అందజేయాలన్నారు. ఆగస్టు 15న ప్రతి రైతుకు జీవితబీమా పట్టాను అందించడం జరుగుతుందన్నారు. రైతుకు మంచి చేస్తే కొంతమందికి కడుపుమండుతుందంటూ కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు. రైతులకు గిట్టుబాటుధర కల్పించేందుకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పేందుకు సిఎం కేసిఆర్ కృత నిశ్చయంతో ఉన్నట్లు వారు తెలిపారు. రాష్ట్రంలో మిషన్ కాకతీయ ద్వారా 46వేల చెరువులు, 100 కోట్లతో ఎత్తపోతల పథకాలను అభివృద్ది చేశామన్నారు. రైతుబీమా కార్యక్రమం ద్వారా 1500కోట్ల రూపాయలు ఖర్చుచేసి ప్రతిరైతుకు బీమా భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి కృషిచేస్తున్నారన్నారు. గోదావరి జలాలను 8వేల కోట్ల వ్యయంతో 10లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు కృషిచేస్తున్నామన్నారు. 45వేల కోట్లతో మిషన్‌భగీరథ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి త్రాగునీరందించేదుకు పనులు చివరి దశకు చేరుకున్నాయని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరికి అందచేయడంలో కార్యకర్తలు ముందుండాలన్నారు. వ్యవసాయరంగంలో తెలంగాణ ప్రభుత్వం తీసువస్తున్న విప్లవాత్మక మార్పులను వివిధ రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు. ఇదే సభలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా గుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ 300కోట్ల వ్యయంతో రైతు వేదికల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. రైతు సమన్వయ సమితులు అన్నదాతలకు అండగా ఉండి, సాగుకు సహయసహాకారం అందించాలన్నారు. రైతుప్రతినిధులు, మార్గదర్శకులగా గర్వించే విధంగా రైతు సమన్వయ సమితి సభ్యులు పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో రైతులకు చేరేవిధంగా పనిచేయాల్సిన అవసరముందన్నారు. కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శాసన సభ్యులు మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, వ్యవసాయ శాఖ కమీషనర్ జగన్, జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్, డిసిసిబి చైర్మన్ మువ్వా విజయబాబు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ కృష్ణారెడ్డి, జెడిఎ ఝాన్సీలక్ష్మీకుమారి, ఆత్మ పిడి విజయనిర్మల తదితరులు పాల్గొన్నారు.

నిబంధనలను పాటించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి
* డిఇఓ కార్యాలయం ముందు పిడిఎస్‌యు ఆధ్వర్యంలో ధర్నా
ఖమ్మం(కల్చరల్) జూన్ 19; ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్ధి సంఘం(పిడిఎస్‌యు) ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, అనంతరం డిఇఓ మధన్‌మోహన్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం సురేష్, ఎన్ ఆజాద్‌లు మాట్లాడుతూ ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యా ప్రమాణాలు పాటించకుండా డొనేషన్ల పేరుతో వేలాది రూపాయల దోపిడికి పాల్పడడమే కాకుండా స్టేషనరీ, యూనిఫాం, మెటీరియల్, షూ, టై, బుక్స్ తదితరాల అమ్మకాలను స్కూల్‌లో ప్రారంభించి అధికధరలకు అంటగడుతూ విద్యార్ధుల తల్లిదండ్రులను నిలువునా దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ దోపిడీ అంతా జిల్లా విద్యాశాధికారులు కనుసన్నల్లోనే జరుగుతున్నా పట్టించుకోవడంలేదనే విమర్శలు అధికంగానే ఉన్నాయన్నారు. జిల్లాలోని గుర్తింపులేని పాఠశాలలపై, సౌకర్యాలులేని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యమేమింటోనని వారు ప్రశ్నించారు. తక్షణమే నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని, గుర్తింపులేని ఫాఠశాలలను రద్దుచేయాలని, ఢిఎఫ్‌ఆర్‌సిని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్ధులను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు బి సురేష్, ఉమ, కిరణ్, ప్రవీణ్, సునీల్, మస్తాన్, రమేష్, జ్యోతి, మహేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.