ఖమ్మం

వ్యవసాయ విజ్ఞాన కేంద్రాలుగా రైతు వేదికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేంసూరు, జూన్ 23: వ్యవసాయ శాస్త్ర విజ్ఞానం కొద్ది కాలంలోనే రైతుల ముంగిటకు రైతు వేదికల ద్వారా అందబోతున్నదని రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు బండి గుర్నాధరెడ్డి అన్నారు. రైతు బీమా పత్రాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శనివారం కందుకూరు గ్రామంలో రైతులకు బీమా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 129 వ్యవసాయ క్లష్టర్‌లకు గాను 105 వ్యవసాయ క్లష్టర్‌లలో రైతు వేదికలకు భూ సేకరణ పూర్తి అయిందన్నారు. ఒక్కొ వేదిక నిర్మాణానికి రూ.12 లక్షలు ఖర్చు చేయబడతాయని వివరించారు. ఒక్కొ రైతు వేదిక పరిధిలో 5వేల మంది రైతులకు నూతన వ్యవసాయ సాంకెతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుందని వివరించారు. ప్రతి వ్యవసాయ క్లష్టర్‌కు ఏ ఈ ఓ రైతులకు సూచనలు సలహాలు ప్రభుత్వ వ్యవసాయ విధానాలను రైతుల చెంతకు చేరవేస్తానన్నారు. సత్తుపల్లి డివిజన్ పరిధిలో 31 వ్యవసాయ క్లష్టర్‌లకు గాను 25 వ్యవసాయ క్లష్టర్‌లలో రైతు వేదికల నిర్మాణాలకు సిద్దంగా ఉన్నాయన్నారు. తల్లాడ, పెనుబల్లి మండలాల్లో మరో ఆరు వేదికలు త్వరలోనే వేదిక నిర్మాణాలుకు భూ సమస్య తీరుతుందని వివరించారు. దేశంలో ఏ ర్రాష్టం లో చేపట్టని రీతిలో రైతు భీమా అందించిన తెలంగాణా ప్రభుత్వానికి ఈ సందర్బంగా ఆయన రైతుల తరుపున కృతజ్ఞతలు తెలిపారు. భీమాతో రైతుల కుటుంబాలు కొంత ధీమాగా జీవించే అవకాశం ఉందన్నారు. భీమా అందించటం తో పాటు అప్పులు లేని వ్యవసాయం కోస సాగు పెట్టుబడి అందించి రైతులకు మేలు చేస్తున్న తెలంగాణా ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారిందన్నారు. తెలంగాణాలో నీటి పారుదల సౌకర్యం ఉన్న పంటలు పండించుకునే అవకాశం లేదని అట్టి నదుల నుండి నీటిని రైతులకు అందించేందుకు కేసి ఆర్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రాజెక్టులు చేపడుతున్న విషయాన్ని రైతులు గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయాధికారి వై.శ్రీనివాసరావు, ఆత్మా ఏటి ఎం నవ్యా, ఉప సర్పంచ్ గొర్ల ప్రభాకర్‌రెడ్డి రైతులు సీతారామిరెడ్డి, చిన్న పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జూలై 7వరకు 144 సెక్షన్
* సీపీ తఫ్సీర్ ఇక్బాల్
ఖమ్మం(క్రైం), జూన్ 23: ఖమ్మం కమిషనరేట్ పరిధిలో జూలై 7వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మం పోలీస్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఎటువంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదన్నారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున ప్రజలు, రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహాకరించాలని కోరారు.

శ్యామ్ ముఖర్జీకి ఘన నివాళులు
ఖమ్మం(క్రైం), జూన్ 23: జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సభను స్థానిక బిజెపి కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖర్జీ చిత్రపటానికి బిజెపి నగర అధ్యక్షుడు రుద్రప్రదీప్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖర్జీ జూలై 6, 1901లో కలకత్తాలో జన్మించారు. ఆయన న్యాయవాద విద్యను అభ్యసించి ఇంగ్లాండ్‌లో బాలిస్టర్ పూర్తిచేశారన్నారు. హిందూ మహాసభలో చేరి రెండు పర్యాయాలు కేంద్రమంత్రిగా దేశానికి ఎనలేని సేవలందించి జూన్ 23, 1953లో మరణించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గెంటాల విద్యాసాగర్, వక్కలంక సుభ్రమణ్యం, శ్రీనివాసయాదవ్, శ్రీదేవి, లత, ఎస్‌కె అసీఫ్, జకరయ్య, శీతారామ్, శంకర్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.