ఖమ్మం

మలేరియా రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, జూన్ 23: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను మలేరియా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని ఐటీడీఏ పీవో పమేలా సత్పతి పేర్కొన్నారు. మలేరియా నిర్మూలన కోసం గిరిజన గ్రామాల్లో చేపట్టే ఐఆర్‌ఎస్ స్ప్రేయింగ్ కార్యక్రమంపై వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో హెల్త్ సూపర్‌వైజర్లు, హెచ్‌ఈవోలు, సబ్ యూనిట్ అధికారులు, మలేరియా సూపర్‌వైజర్లతో భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి ముందుగా దోమల మందు పిచికారి చేసే వస్తువులను, మలేరియా కిట్‌ను పీవో పరిశీలించారు. ఏడీఎంహెచ్‌వో సింగరాజుకు మలేరియా రక్తపరీక్ష నిర్వహించి నిర్థారణ తీరును సిబ్బంది పీవోకు వివరించారు. అనంతరం సమీక్షా సమావేశంలో పీవో మాట్లాడుతూ వ్యాధుల కాలం ప్రారంభమైందని, ఈ సీజన్‌లో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు. మలేరియా నిర్మూలనకు పిన్‌పాయింట్ ప్రోగ్రాం అమలు చేయాలని, డేటావైజ్, విలేజ్‌వైజ్, పాప్‌లేషన్‌వైజ్ నివేదికలు తయారు చేయాలని, 6 హ్యాబిటేషన్లలో మొదటి విడత స్ప్రేయింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. దోమల నివారణను పండుగలా నిర్వహించాలని, ప్రతి గ్రామంలో స్ప్రేయింగ్ యాక్షన్‌ప్లాన్‌పై ఆయా మండలాల ప్రజాప్రతినిధులకు వివరించి ఎస్‌హెచ్‌జీ గ్రూపుల ద్వారా గ్రామాల్లో ప్రచారం చేయించాలన్నారు. ఈనెల 28వ తేదీ వరకు మొదటి విడత స్ప్రేయింగ్ ప్రారంభించాలని, దీనికోసం మలేరియా సిబ్బందికి శిక్షణ ఇప్పించామని పీవో తెలిపారు. ప్రజలకు జ్వరాలు సోకితే మలేరియా కాదు అనే నినాదంతో పనిచేసి రక్త పరీక్ష తీసుకొని చికిత్సలు అందించాలన్నారు. స్ప్రేయింగ్ చేసేటప్పుడు గ్రామాల్లో ఇళ్లకు తాళాలు వేసి ఉంటే మరో విడతలో స్ప్రేయింగ్ చేయాలని సూచించారు. మలేరియా టెక్నికల్ అధికారులు పాజిటివ్ కేసులు గుర్తించి మూడురోజులకు ఒకసారి చికిత్స అందించాలన్నారు. ఒక గ్రామంలో 100 కుటుంబాలు ఉంటే అందులో ఎవరికైనా మలేరియా పాజిటివ్ అని తేలితే గ్రామంలో వ్యాపించకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మలేరియాతో ఏ వ్యిక్తి చనిపోకుండా అప్రమత్తంగా ఉండాలని, వ్యాధులకు సంబంధించి అన్ని మందులు పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉంచుకోవాలని పీవో సూచించారు. గ్రామాల్లో హెల్త్‌క్యాంపులు నిర్వహించాలన్నారు. సమావేశంలో ఏడీఎంహెచ్‌వో ఉషారాణి, జిల్లా మలేరియా సిబ్బంది పాల్గొన్నారు.

వాల్‌ప్రాజెక్ట్ పనులు ప్రారంభం
ఖమ్మం(ఖిల్లా), జూన్ 23: ఖమ్మం నగరం సుందరీకరణలో భాగంగా 16లక్షల వ్యయంతో చేపట్టిన వాల్‌ప్రాజెక్ట్ పనులను మేయర్ పాపాలాల్‌తో కలసి ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరాభివృద్ధితో పాటు సుందరీకరణకు అనేక చర్యలు తీసుకుంటున్నామని అందులో భాగంగా వాల్‌ప్రాజెక్ట్ పనులు చేపట్టినట్లు వెల్లడించారు. గత రెండు సంవత్సరాల క్రితం ఖమ్మంలో చేపట్టిన వాల్‌ప్రాజెక్ట్ పనులతో రాష్ట్రంలోఖమ్మం నగరానికి మంచి గుర్తింపు వచ్చిందన్నారు. వాటి స్థానంలో ఆకర్షణీయంగా ఉండేలా నూతన హంగులతో నగరాన్ని వాల్‌ప్రాజెక్ట్ ద్వారా మరింత సుందరీకరించనున్నామన్నారు. ప్రధాన రోడ్డుకు ఇరువైపుల ఉన్న గోడలపై కళాకండాలు, సంస్కృతిక చిత్రాలు, క్రీడలు, ఆధ్యాత్మిక చిత్రాలతో పాటు వివిధ సందేశాత్మక చిత్రాల ద్వారా ప్రజలకు ఆహ్లాద వాతావరణాన్ని కల్పిస్తున్నామన్నారు. హరితహారం కోసం గాంధీపార్కు, లకారంచెరువు నర్సరీ, గోపాలపురం పార్కులలో ఆయుర్వేధిక్, ఔషధ, పండ్ల మొక్కలు, నీడనిచ్చే వివిధ రకాల 2.50లక్షల మొక్కలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి మేయర్ బత్తుల మురళీ, కార్పొరేటర్లు ఎం మనోహర్‌రావు, పి నాగరాజు, వి నర్సింహరావు తదితరులు పాల్గొన్నారు.