ఖమ్మం

అంటువ్యాధులు ప్రబలకుండా కాపాడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, జూన్ 23: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పని చేస్తున్న పంచాయితీ, ఆర్‌డబ్య్లూఎస్, వైద్యశాఖ సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి పట్టణ ప్రాంత ప్రజలకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు అన్నారు. పంచాయతీ, ఆర్‌డబ్య్లూఎస్, వైద్యశాఖలను సమన్వయం చేసేందుకు జిల్లా పంచాయితీ అధికారి ఆధ్వర్యంలో శనివారం భద్రాచలంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను ఆరోగ్య రహిత జిల్లాగా మార్చాలనే ఉద్దేశంతో పై మూడు శాఖల అధికారులకు ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆరోగ్యం అనేది అందరికీ అవసరమని, వర్షాకాలంలో వచ్చే వ్యాధులను గుర్తించేందుకు సంబంధిత మూడు శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అందరూ సమన్వయంగా పని చేయాలన్నారు. పంచాయితీ అధికారులు పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని, ఆర్‌డబ్య్లూఎస్ అధికారులు తాగునీరు కలుషితం కాకుండా స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని గ్రామ పంచాయితీల్లో బ్లీచింగ్ పౌడర్ అందుబాటులో ఉందని, మండలాల్లో గ్రామ పంచాయితీల ద్వారా వాటర్ ట్యాంకుల్లో క్లోరినేషన్ చేసి పరిశుభ్రమైన తాగునీరు అందించాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వర్షాకాలంలో వచ్చే వ్యాధులపై దృష్టిసారించి నివారణ మార్గాలు అనే్వషించాలని, వ్యక్తిగత పరిశుభ్రతపై దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాల్లో, మండలాల్లో సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు ఎంపీపీ, వార్డు సభ్యులు, జడ్పీటీసీ, సర్పంచి, ప్రజలకు తెలియజేసి పరిశుభ్రతపై ప్రజలను చైతన్యం చేయాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లను ఉపయోగించుకోవాలని, గ్రామాల్లో అందరూ బహిరంగ మల విసర్జనను నిర్మూలించాలని ప్రజలకు వివరించేలా చూడాలన్నారు. మండలాల్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకు రావాలని, పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మలేరియా, డెంగ్యూ నివారణపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు దృష్టిసారించాలని, గ్రామాల్లో ఐఆర్‌ఎస్ స్ప్రేయింగ్ చేయించాలని, రానున్న వ్యాధుల కాలానికి అనుగుణంగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ ఏడాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లను డెంగ్యూ, మలేరియా రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని, దానికి సంబంధిత అధికారుల సమన్వయం చాలా అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. సదస్సులో ఐటీడీఏ పీవో పమేలా సత్పతి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి దయానందస్వామి, జిల్లా పంచాయితీ అధికారి ఆశాలత, ఎడీఎంహెచ్‌వో ఉషారాణి, సంబంధిత పంచాయితీ, ఆర్‌డబ్ల్యూఎస్, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.