ఖమ్మం

తెలంగాణ ఉద్యమ నాయకుడికి ఘన సన్మానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అశ్వాపురం, జూన్ 24: తెలంగాణ రాష్ట్ర సాధనలో ముమ్మరంగా ఉద్యమాన్ని నిర్వహించి ఉద్యమ నాయకుడికి అశ్వాపురంలోని దోసపాటి రంగారావు కల్యాణ మండపంలో ఘనంగా సన్మాన కార్యక్రమం జరిగింది. కేసీఆర్ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి, షామీర్‌పేట ముస్లిం, మైనారిటీ నాయకుడు మహ్మద్ అబ్దుల్‌ఖాన్‌ను తెలంగాణ మాదిగ జేఏసీ ముస్లిం, మైనారిటీ, తుడుందెబ్బ, మాల సంక్షేమ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం సన్మానించారు. తొలుత గౌతమీనగరం కాలనీ గేటు నుంచి మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పోలీసుస్టేషన్, సినిమాహాల్ సెంటర్ మీదుగా పాత బస్టాండ్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కల్యాణ మండపంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో సామాజిక సంఘాల నాయకులు మాట్లాడుతూ మహ్మద్ అబ్దుల్‌ఖాన్ తెలంగాణ ఉద్యమంలో మేడ్చల్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారన్నారు. సామాజిక ఉద్యమ కార్యక్రమాల్లో అగ్రభాగాన పోరాటం చేశారన్నారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత అబ్దుల్‌ఖాన్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు తనవంతు కృషి చేస్తానన్నారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పలు విధాలుగా అనేక రకాల పోస్టులతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నానన్నారు. కార్యక్రమంలో గద్దల నాగేశ్వరరావు, నజీర్‌సోన్, సురేష్, కిరణ్, కొమరం అనిల్, మనోజ్, పాషా, నాగరాజు, సతీష్, చిరంజీవి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

సోములమ్మ జాతర ప్రారంభం
చర్ల, జూన్ 24: చర్ల మండల కేంద్రానికి సమీపాన ఉన్న పూజారిగూడెంలో రెండురోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే సోములమ్మ జాతర ఆదివారం ప్రారంభమైంది. ఆలయ పూజారి సింగా శ్రీను, బద్దె బాబు ఆధ్వర్యంలో ఆది, సోమవారాల్లో జరిగే సోములమ్మ జాతరకు పూజారిగూడెంతో పాటు సింగసముద్రం, లెనిన్‌కాలనీ, మల్లారం, ఆనంద్‌కాలనీ నుంచి భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి జాతరకు తరలివచ్చారు. ప్రతి ఏడాది తొలకరి చినుకులను స్వాగతిస్తూ జరిగే ఈ జాతరకు ఒక ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా ఏడాదంతా వర్షాలు సకాలంలో కురిసి ఈ ప్రాంతంలో పంటలు సమృద్ధిగా పండాలని ఈ జాతరను నిర్వహిస్తున్నారు. తొలిరోజు అమ్మవారికి గంగాస్నానం చేయించి ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం విశేష పూజల అనంతరం సోములమ్మను గుట్టకు సాగనంపనున్నారు. ఈ వేడుక ఘనంగా జరగుతోంది. తొలకరి వర్షాలు దోబూచులాట ఆడుతున్న సమయంలో అన్నదాత ఖరీఫ్ సాగును ప్రారంభించేందుకు సోములమ్మకు ప్రత్యేక పూజలు చేశారు.