ఖమ్మం

పెద్దమ్మతల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాల్వంచ, జూన్ 24: పాల్వంచ మండల పరిధిలోని కెపి జగన్నాథపురం గ్రామంలో కొలువుతీరిన పెద్దమ్మతల్లి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవురోజు కావడంతో ఉమ్మడి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తమతమ మొక్కుబడులను చెల్లించుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అదేవిధంగా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ఆర్ కాంతారావు కుటుంబ సమేతంగా పెద్దమ్మతల్లి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటిసారిగా ఆలయానికి వచ్చిన న్యాయమూర్తికి ఆలయ మర్యాదలతో ఈఒ ఎస్ శ్రీనివాస్ ఘనంగా స్వాగతం పలకగా, అర్చకులు ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం శేషవస్త్ర ప్రసాదాలను అందజేసి ఘనంగా సన్మానించారు. ఆలయానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఆలయ ఈఒ సౌకర్యాలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్‌ఐ అనీల్‌కుమార్, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

అరటినారతో కళాకృతుల తయారీ
పాల్వంచ, జూన్ 24: స్థానిక నవభారత్ వెంచర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా మహిళా సాధికారత కేంద్రంలో ఆదివారం అరటినారతో కళాకృతుల తయారీలో ఉచిత శిక్షణ కేంద్రాన్ని నవభారత్ వైస్‌ప్రెసిడెంట్ వై శ్రీనివాసమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరటినారతో బుట్టలు, టేబుల్ మ్యాట్‌లు, ఇతర గృహోపకరణాలు తయారు చేయవచ్చన్నారు. ఈ శిక్షణా కేంద్రంలో మహిళలకు ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమీషన్, కేరళకు చెందిన అనుభవఙ్ఞలైన బృందం సహకారంతో శిక్షణ ఇవ్వనున్నట్లుగా తెలిపారు. ఈ శిక్షణాకేంద్రంలో మహిళలు కళాకృతులను తయారు చేసి నెలకు రూ.4వేల నుండి, 5వేల వరకు ఉపాధి పొదవచ్చన్నారు. అందువల్ల మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్ధికంగా అభివృద్ది చెందాలని కోరారు. అనంతరం పలువురు మహిళలు అరటి నారతో పలు కళాకృతులను తయారు చేశారు. ఈ కార్యక్రమంలో ఎండి అలీ, పాండురంగారావు, రామారావు, తదితరులు పాల్గొన్నారు.