ఖమ్మం

కాంగ్రెస్‌పార్టీతోనే అభివృద్ధి సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైరా, జూలై 17: కాంగ్రెస్‌పార్టీతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని జిల్లా కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధి పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కెజి. సిరిపురం, స్టేజిపినపాక గ్రామాలకు చెందిన పులు కుటుంబాలు కాంగ్రెస్‌పార్టీలోకి చేరాయి. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పువ్వాళ్ళ మాట్లాడుతూ కాంగ్రెస్‌పార్టీ అంటేనే పేదల పార్టీ అని ప్రజల్లో నాటుకుపోయిందని అన్నారు. ఈవిషయం అధికారపార్టీ ప్రజలకు కూడా తెలుసని అన్నారు. రానున్న ఎన్నికల్లో కెసిఆర్‌కు ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రజలను మభ్యపెట్టడం మాత్రమే కెసిఆర్ చేస్తున్నారని ప్రజలు తెలుసుకున్నారని అన్నారు. ప్రజలు దేవుళ్ళు అని కెసిఆర్ మాయమాటలకు బుద్ధి చెప్తారని అన్నారు. ఏఒక్క పేదవాడికి ఇప్పటి వరకు ఇళ్ళు రాలేదని ఆరోపించారు. డబుల్ బెడ్‌రూం కలగానే ఉందన్నారు. నిరుద్యోగంతో యువకులు అలమటిస్తున్నారని అన్నారు. ఈకార్యక్రమంలో మండల కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు పసుపులేటి మోహన్‌రావు, జిల్లా కిసాన్‌సెల్ అధ్యక్షులు శీలం వెంకటనర్సిరెడ్డి, నాయకులు దాసరి దానియేలు, మట్టూరి వీరయ్య, వేల్పుల జయరాజు, చప్పిడి వెంకటేశ్వర్లు, మట్టూరి క్రిష్ణారావు, పొదిల హరినాథ్, షేక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజల కోసమే పనిచేయడమే కమ్యూనిస్టుల పని
* పోటు రంగారావు
వైరా, జూలై 17: కమ్యూనిస్టులంటేనే ప్రజల కోసం పనిచేయడమని ఎమ్‌ఎల్ పార్టీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. మంగళవారం స్థానిక విక్రమ్‌భవన్‌లో ఆపార్టీ వైరా - కల్లూరు డివిజన్ సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. దేశంలో, రాష్ట్రంలో కార్పోరేట్‌శక్తులకు మద్దతుగానే పనిచేస్తున్నాయే తప్ప, పేదవాడికోసం మాత్రం కాదని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏప్రభుత్వాలు అమలు చేయకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. హిందూ మతోన్మాదంలో కేంద్రప్రభుత్వ పాలన కొనసాగుతున్నదని అన్నారు. రాష్ట్రంలో కుటుంబపాలనలో మునిగిపోయిందన్నారు. రాష్ట్రంలో తుగ్లక్‌పాలనను మైమరిపిస్తున్నారని కెసిఆర్‌ని విమర్శించారు. నిరుద్యోగుల గోడు ఎవ్వరికీ పట్టడం లేదని అన్నారు. రానున్న కాలంలో ప్రజలు తగిన విధంగా కెసిఆర్, మోడీకి బుద్ధి చెపుతారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలకు మద్దతుగా కమ్యూనిస్టులు పనిచేయాలని ఆయన కోరారు. కార్యకర్తలు, నాయకులు స్వతంత్రంగా పేదలకోసం, పార్టీ అభివృద్ధికోసం పనిచేయాలని సూచించారు. ఈసమావేశంలో నాయకులు వెంకటేశ్వర్లు, అర్జున్‌రావు, శ్రీశైలం, వెంకటరెడ్డి, శ్రీను, అప్పారావు, శరత్, లాల్‌మియా, యలదండి బాబు, లలిత, సురేష్ తదితరులు పాల్గొన్నారు.