ఖమ్మం

టీఆర్‌ఎస్‌లో తిరుగుబాటు..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మణుగూరు, జూలై 16: అధికార టీఆర్‌ఎస్ పార్టీలో ప్రజాప్రతినిధులపై పార్టీ నేతలు అసమ్మతి పేరుతో తిరుగుబావుటా ఎగురవేస్తున్నట్లు సమాచారం. రాష్టవ్య్రాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ వర్గపోరు కొనసాగుతున్నప్పటికీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఒక గిరిజన నియోజకవర్గంలో అసమ్మతి వర్గం బలంగా తమ వాణిని అధిష్టానానికి వినిపించేందుకు పావులు కదుపుతోంది. జిల్లాలోనే ఒక గిరిజన ఎమ్మెల్యేపై దండెత్తిన పార్టీ కిందిస్థాయి ప్రజాప్రతినిధులు, కీలక నేతలు గత కొంతకాలంగా రహస్య మంతనాలు జరుపుతూ ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా బలాన్ని కూడగట్టుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈ మధ్య కాలంలో పలు సమావేశాలు నిర్వహించుకొని ప్రజాప్రతినిధి కార్యకలాపాలపై తాము ఎదుర్కొంటున్న సమస్యలను పార్టీ అధిష్టానంకు తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో సమావేశం నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికగా ఈనెల 9న ఒక ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో మండలస్థాయి ప్రజాప్రతినిధులు, కీలక నేతలు, నామినేటెడ్ డైరక్టర్లు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై పకడ్భందీగా ప్రణాళిక రచించుకున్నట్లు తెలిసింది. జిల్లా మంత్రికి వ్యతిరేకంగా ముద్రపడిన సదరు నియోజకవర్గ ప్రజాప్రతినిధికి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా అధిష్టానంను ఒప్పించేందుకు సంతకాల సేకరణ కూడా చేపట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మరో భారీ సమావేశాన్ని నియోజకవర్గ స్థాయిలో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గత కొంతకాలంగా పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న టీఆర్‌ఎస్ అసమ్మతి వర్గం తమ వ్యతిరేకత అంతా ప్రజాప్రతినిధి అనుసరిస్తున్న విధానాలపైనే కానీ పార్టీపై కాదంటూ తమ అసమ్మతిపై వస్తున్న వాదనలను తిప్పికొడుతున్నారు. అసమ్మతి పోరుకు చెక్ పెట్టాల్సిన ప్రజాప్రతినిధి సమస్యను చాలా చిన్న విషయంగా పరిగణిస్తూ వస్తున్నారు. నియోజకవర్గంలో అసమ్మతిని మించిన అభివృద్ధి తన గెలుపునకు బంగారు బాట వేస్తుందని గట్టి నమ్మకంతో ఉన్న సదరు ప్రజాప్రతినిధి నిత్యం నియోజకవర్గంలో పర్యటిస్తూ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనల్లో తలమునకలై ఉన్నారు. అసమ్మతికి తోడు ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి ప్రజాప్రతినిధి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామంటూ ఉద్యమ కార్యాచరణ ప్రకటించడంతో నియోజకవర్గ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. నియోజకవర్గంలోని వౌలిక వసతుల కల్పనపై ఎమ్మెల్యే దృష్టిసారించడం లేదంటూ ఆందోళనలు చేపట్టి ప్రజలను చైతన్యం చేసేందుకు వామపక్ష పార్టీలతో కాంగ్రెస్, టీడీపీలు సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. మొత్తం మీద భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఒకే ఒక నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం మొత్తం రాష్ట్ర రాజకీయాలను ఆకర్షించే దిశగా పరిణామాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పొత్తులపై ఇప్పటి వరకు ఎక్కడా స్థిర నిర్ణయానికి రాని రాజకీయ పార్టీలు జిల్లాలో మాత్రం మారుమూల గిరిజన నియోజకవర్గం నుంచే తమ పొత్తులకు శ్రీకారం చుట్టాయి. ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రజా ప్రతినిధి ఓటమే ధ్యేయంగా సమిష్టిగా పని చేయాలని, పార్టీలకు అతీతంగా ఎవరు పోటీ చేసినా సీపీఐ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఎవరో ఒకరిని గెలిపించే దిశగా పనిచేయాలన్నదే ధ్యేయంగా అంగీకారానికి వచ్చాయి. వీరికి తోడు అసమ్మతి అధికమైన టీఆర్‌ఎస్‌కు ప్రజాప్రతినిధి తీరు అంతుపట్టక అధిష్టానం తలలు పట్టుకుంటోంది. జిల్లా మంత్రి కూడా జరుగుతున్న పరిణామాలన్నింటినీ నిశితంగా పరిశీలిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి విషయాన్ని తీసుకెళ్తున్నట్లు సమాచారం.

గణితంపై భయాన్ని పారద్రోలే ‘చేయూత’
* ఐటీడీఏ పీఓ పమేలా సత్పతి
భద్రాచలం టౌన్, జూలై 17: గిరిజన విద్యార్థులకు గణితంపై ఉన్న భయాన్ని పోగొట్టి సులభంగా సూత్రాలను చేయగలగడం, గణితంపై అపోహలు పోగొట్టి వారి శక్తి సామర్థ్యాలను బయటకు తీసేందుకు ‘చేయూత’ పుస్తకం ఒక దిక్చూచిలా పని చేస్తుందని ఐటీడీఏ పీవో పమేలా సత్పతి అన్నారు. భద్రాచలంలోని గిరిజన బీఈడీ కళాశాలలో మంగళవారం గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గణితం బోధించే రెగ్యులర్ ఉపాధ్యాయులకు, ఎస్‌జీటీలకు, సీఆర్‌టీలకు, స్కూల్ అసిస్టెంట్‌లకు చేయూత గణిత దీపికపై మూడు రోజుల అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ అవగాహన సదస్సును పీఓ ప్రారంభించి మాట్లాడారు. చేయూత గణిత దీపికపై ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల నుంచి వచ్చిన గణిత ఉపాధ్యాయులకు ఈనెల 19 వరకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. విషయ నిపుణుల ఆధ్వర్యంలో ఈ శిక్షణా శిబిరం కొనసాగుతుందని, ఉపాధ్యాయులంతా వారి అభిప్రాయాలను, వ్యూహాలను ఏర్పర్చుకొని ఏ విధంగా బోధిస్తే విద్యార్థులు గణితంలో మంచి ఫలితాలు సాధిస్తారో ఒక కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. ఇలా చేయడం ద్వారా ఆశ్రమాల్లోని గిరిజన విద్యార్థులకు నాణ్యమైన గుణాత్మక విద్యను అందించే వీలుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డీడీ సీహెచ్ రామ్మూర్తి, ఏటీవో రమణయ్య, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ సాయన్న, గురుకులం ఆర్‌సీవో బురాన్, ఏటీడీవో జహీరుద్దీన్, లక్ష్మణ్‌బాబు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.