ఖమ్మం

నిబంధనలకు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖానాపురం హవేలి, ఏప్రిల్ 30: పాలేరు శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక సందర్భంగా ప్రజలు 50వేలు, అంతకంటే ఎక్కువ నమోదు తమ వెంట తీసుకెళ్తే వాటిని స్వాధీనం చేసుకుంటామని జెసి దివ్య వెల్లడించారు. శనివారం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో వీడియో మానిటరింగ్ బృందాలు, ఎంపిఎంసి కమిటీ, ఫ్లయిండ్ స్క్వాడ్ బృందాలు ఇతర అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా జెసి దివ్య మాట్లాడుతూ స్టాటిక్ సెర్ప్‌లైన్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఇప్పటి వరకు ఒక్క చోట కూడా నగదు సీజ్ చేయకపోవటం సరికాదని, ఇప్పటి నుంచైనా అధికారులు తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. నియోజకవర్గంలో, జిల్లా సరిహద్దులో వ్యూహాత్మక ప్రాంతాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేయాలన్నారు. పాలేరు నియోజకవర్గంలోని ప్రవేశించే ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలన్నారు. ఎన్నిక మరింత పారదర్శకంగా జరిగేందుకు ఆర్టీఏ, కమర్షియల్, ఇన్‌కంటాక్స్ అధికారులతో కలిసి ఇంటిగ్రెటేడ్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్వేచ్ఛాయుత పారదర్శకత ఎన్నిక జిల్లా యంత్రాంగ పని చేస్తుందని భావనే ప్రజల్లో కలిగేలా వ్యవహరించాలన్నారు. విధులు అలసత్వం వహిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రచారం నిమిత్తం వచ్చే మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు నియోజకవర్గంలోని ప్రభుత్వ వాహనాల్లో రావటం నిషేధమన్నారు. వారిని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ వాహనాల్లో అనుమతించవద్దన్నారు. ఎన్నికల ప్రవర్తన నియావళని ఎవరైనా ఉల్లంఘిస్తే ఎంసిసి పర్యవేక్షక బాధ్యులు మోహన్‌రావుకు సమాచారం అందించాలన్నారు. సమావేశంలో డిఆర్వో శ్రీనివాస్, డిఎస్పీ సురేష్ పాల్గొన్నారు.