ఖమ్మం

పాలేరు ఎన్నికల పరిశీలకుడిగా పళనిస్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖానాపురం హవేలి, ఏప్రిల్ 30: పాలేరు ఉప ఎన్నికను పురస్కరించుకొని కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల పరిశీలకుడిగా తమిళనాడు రాష్ట్రంలోని స్లమ్ క్లియరెన్స్ ఎండిగా పని చేస్తున్న పళనిస్వామిని నియమించారు. కాగా ఆయన శనివారం ఖమ్మం చేరుకొని నామినేషన్ల వీడియో క్లిప్పింగ్‌లను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ దానకిషోర్‌తో కలిసి ఎన్నికల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ దానకిషోర్ ఎన్నికల పరిశీలకుడికి పాలేరు నియోజకవర్గం ఎన్నికలకు సంబంధించి తీసుకుంటున్న చర్యలను వివరించారు. ప్రవర్తనా నియావళి ప్రకారం ఏర్పాటు చేసిన బృందాలు, వాటికి అదనంగా ఒక్కొ బృందాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. బ్యాంక్ లావాదేవీలు, అక్రమ మద్యం, ఎంసిసి టీమ్, వీడియో టీమ్, ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులు, ఎంవిఐ, కమర్షియల్ ట్యాక్స్, పోలీస్ అధికారులు 24గంటలు ఉంటారన్నారు. ఎంసిసిని పటిష్టంగా అమలు చేసేందుకు ఆర్డీవో క్యాడర్ అధికారిని ఇన్‌చార్జిగా నియమించామన్నారు. కలెక్టర్ కార్యాలయంలో టోల్‌ఫ్రీ నెంబరును ఏర్పాటు చేశామన్నారు. నామినేషన్ ప్రక్రియలో రెండు నామినేషన్లను తిరస్కరించినట్లు కలెక్టర్ దానకిషోర్ ఎన్నికల పరిశీలకుడికి వివరించారు. అనంతరం జెసి దివ్య మాట్లాడుతూ అభ్యర్థుల ఖర్చు, వివరాలు ఎంసిఎంసి కమిటీని ఏర్పాటు చేశామన్నారు.