ఖమ్మం

నిబంధనలను ఉల్లంఘిస్తే ఫిర్యాదు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖానాపురం హవేలి, ఏప్రిల్ 30: పాలేరు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఏమైనా అక్రమాలు, ఎన్నికల ప్రవర్తనా నియావళి ఉల్లంఘనలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వస్తే కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 08742-238222కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ దానకిషోర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలు, మద్యం తరలింపు, గిఫ్టుల పంపిణీ, అనుమతి లేని ప్రచారం, హోర్డింగ్‌లు, బ్యానర్లు ఏర్పాటు, నూతన కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణించటం వంటి అంశాలు ప్రజల దృష్టికి వస్తే ఫిర్యాదు చేయాలన్నారు. టోల్‌ఫ్రీ నెంబర్ 24గంటలు అందుబాటులో ఉంటుందని, ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తామని అన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు ప్రజలు సహకరించాలన్నారు.