ఖమ్మం

భారీ వర్షాలపట్ల అప్రమత్తంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఆగస్టు 13: జిల్లాలో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయని, మరి కొన్ని రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎలాంటి నష్టం వాటిల్లకుండా అధికారులు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ లోకేష్‌కుమార్ అదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అధికారులతో మాట్లాడుతూ వర్షాల వల్ల ప్రధాన చెరువులు, కుంటలు, జలశయాల్లోకి భారీగా నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో చెరువుగట్ల పరిస్థితిపై తనిఖీలు నిర్వహిస్తు అప్రమత్తంగా ఉండాలన్నారు. వాతావరణశాఖ వర్షాలు మరికొన్ని రోజులు కురిసే అవకాశం ఉందని పేర్కొన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలలో నివశించే ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. నగరంలో డ్రైనేజి నీరు రోడ్డుపై రాకుండా చర్యలు తీసుకోవాలని, వర్షాల వల్ల దెబ్బతిన్ని రోడ్లను వెంటనే మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖాధికారులను అదేశించారు. తాగునీరు కలుషితం కాకుండా సురక్షితమైన మంచినీరు అందించేందుకు ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయించాలని, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ఆ శాఖ అధికారులు పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ నగేష్, ఆర్డీఓ పూర్ణచంద్ర, డీపీఓ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.