ఖమ్మం

అక్రమ దందాలకు ఇక చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(క్రైం), ఆగస్టు 13: అక్రమ వ్యాపార దందాలకు చెక్ పెట్టాలని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చైన్ స్నాచింగ్ నిందులపై పిడి యాక్ట్ కేసులు నమోదుచేయాలన్నారు. ఇటీవల చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన నిందులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామన్నారు. సిసి కెమెరాలు ఉన్న పట్టణ ప్రాంతాలలో నేరాలుచేస్తే దొరికిపోతామనే భయంతోనే నిందితులు గ్రామీణ ప్రాంతాలలో చోరీలకు పాల్పడుతున్నారన్నారు. నేను సైతం కార్యక్రమం ద్వారా సిసి కెమేరాల ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజలకు అవగాహన పెంచాలన్నారు. అక్రమార్జనే ధ్యేయంగా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించేదిలేదన్నారు. ప్రజలకు ప్రభుత్వ సబ్సిడీగా అందిస్తున్న రేషన్ బియ్యం, ఇసుక అక్రమ రవాణా, గుట్కాల విక్రయాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల కురుస్తున్న వర్షాలలో లోతట్టు ప్రాంతాలలోని ముంపుగ్రామాలను ముందుగానే గుర్తించి అక్కడి ప్రజలను అప్రమత్తంచేసి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ సురేష్‌కుమార్, ఖమ్మం రూరల్ ఏసిపి నరేష్‌రెడ్డి, వైరా, టాస్క్‌పోర్స్ ఎసిపిలు ప్రసన్నకుమార్, రెహ్మాన్, సిసిఆర్బి ఎసిపి రామానుజం తదితరులు పాల్గొన్నారు.
అన్నదాతల అభివృద్ధే కేసీఆర్ లక్ష్యం
వైరా, ఆగస్టు 13: రాష్ట్రంలో అన్నదాతల అభివృద్ధే కెసిఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే బాణోతు మదన్‌లాల్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని గన్నవరం గ్రామంలో అన్నదాతలకు రైతు బీమా బాండ్లను అందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మదన్‌లాల్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని వ్యవసాయ రంగం అభివృద్ధిపథంలో ఉండాలని కోరుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో భూప్రక్షాళన కార్యక్రమం ద్వారా ఎన్నో సంవత్సరాల నుండి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను తీర్చిన ఘనత కెసిఆర్‌దే అని అన్నారు. అధునాతన భూమిపాస్‌పుస్తకాలు ఒక్కపైసా ఖర్చు లేకుండా రైతులకు అందజేశారన్నారు. జిల్లా మంత్రి తుమ్మల ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశామలంగా ఉండాలనీ సీతారామ ప్రాజెక్టు శరవేగంగా నిర్మాణం చేపట్టాలని పనులు వేగవంత జరుగుతున్నాయని అన్నారు. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన త్రాగునీరు అందించే దిశగా మిషన్‌భగీరథ పథకం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం గన్నవరం గ్రామం నుండి నెమలి వెళ్ళే మార్గంలో బ్రిడ్జి వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న వైరానదీ ప్రవాహాన్ని పరిశీలించారు. ఈకార్యక్రమంలో ఎఓ పవన్‌కుమార్, ఎఈఓ సైదులు, టిఆర్‌ఎస్ జిల్లా నాయకులు మచ్చా వెంకటేశ్వరావు (బుజ్జి), వనమా విశే్వశ్వరావు, మండల రైతు సమన్వయ సమితి కో - ఆర్డినేటర్ కస్తాల నాగకోటేశ్వరావు, నాయకులు తన్నీరు జ్యోతి, మాదినేని సునీత, ప్రసాద్, నిర్మల, క్రిష్ణమూర్తి, వైద్యులు కోటయ్య పాల్గొన్నారు.

చెరువులో పడి మత్స్యకారుడి మృతి
చింతకాని, ఆగస్టు 13: ప్రమాదవశాత్తు చెరువులో పడి మత్స్యకారుడు మృతి చెందిన ఘటన సోమవారం మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బొమ్మకంటి ఆదినారాయణ (53) చెరువు నిండడంతో చేపలు చెరువు నుండి బయటకి పోకుండా ఉండేందుకు వలలు కట్టేందుకు నీళ్ళలోకి దిగి ప్రమాదవశాత్తు నీటమునిగి మృతి చెందాడు. మత్స్యకారుడైన ఆదినారాయణ మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరైనారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.