ఖమ్మం

సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(మామిళ్ళగూడెం), ఆగస్టు 13: ప్రజల వినతులను పరిశీలించి వారి సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ డిఎస్ లోకేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ప్రజల నుండి వినతులను స్వీకరించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ శాఖలలో పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సత్వర పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రజలు ఒకే సమస్యపై మళ్ళీ మళ్ళీ రాకుండా వారికి త్వరితగతిన పరిష్కారం చూపాలన్నారు. ఆయా శాఖల ద్వారా అమలుచేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంచేసి లక్ష్యాలను పూర్తి చేసేందుకు కృతనిశ్చయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాను అన్ని ప్రభుత్వ పథకాలలో ముందుకు తీసుకువెళ్ళేందుకు అధికారులు అంకితబావంతో తమ బాధ్యతలు నిర్వహించాలన్నారు. జిల్లా నలుమూలల నుండి ప్రజలు భూ వివాదాలు తదితర సమస్యల పరిష్కారంకోరుతూ కలెక్టర్‌కు విన్నవించారు. తల్లాడ మండలం తెలగవరం గ్రామ రెవిన్యూ పరిధిలో ఫలనా సర్వే నంబర్లలో పొలం తన పేరున ఉందని పట్టాదారు పాస్ పుస్తకంకోసం మండల తహశీల్దార్‌ను ఎన్ని దఫాలు విన్నవించుకున్న తనకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని దీనిపై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని తెలగవరం గ్రామానికి చెందిన రైతు కలెక్టర్‌కు విన్నివించారు. తన భర్త నారాయణమూర్తి జడ్పీఎస్‌ఎస్ పాఠశాలలో పనిచేస్తూ మృతిచెందాడని మరణానంతరం రావాల్సిన బెన్ఫిట్స్, పించన్ మంజూరులో జాప్యం జరుగుతుందని వాటిని ఇప్పించాలని తల్లాడకు చెందిన పద్మ కలెక్టర్‌కు విన్నవించింది. కామెపల్లి మండలం ఊటుకూరు రెవిన్యూ పరిధిలో తనకు చెందిన భూమికి అన్ని హక్కులు ఉన్నప్పటికి పట్టాదారు పాస్‌పుస్తకం రాలేదని తనకు న్యాయం చేయాలని రైతు కొంగర మాదవరావు విన్నవించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సి ఇవో మారుపాక నగేష్, కలక్టరేట్ పరిపాలనాధికారి మదన్‌గోపాల్, డిపివో శ్రీనివాసరెడ్డి, డిఆర్‌డివో ప్రాజెక్ట్ డైరెక్టర్ బెల్లం ఇందుమతి తదితరులు పాల్గొన్నారు.