ఖమ్మం

దశాబ్దం తరువాత జలకళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైరా, ఆగస్టు 13: స్థానిక రిజర్వాయర్‌కు విపరీతంగా నీటి ప్రవాహం వస్తుండటంతో రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండింది. సోమవారం సాయంత్రానికి 19.6లకు చేరుకుంది. దీంతో అలుగులు పొంగి ప్రవహిస్తున్నాయి. 2005 సంవత్సరం సెప్టెంబర్‌లో వచ్చిన వరదలకు రిజర్వాయర్ కింద స్నానాల లక్ష్మీపురం, ముసలిమడుగు గ్రామాలు పూర్తిస్థాయిలో వరద తాకిడికి దెబ్బతిన్నాయి. కాగా అప్పటినుండి ఇప్పటి వరకు చెప్పుకునే స్థాయిలో వరద రాలేదు. కాని సుమారు 13 సంవత్సరాల కాలంలో ఒక్క రాత్రికి రాత్రే 17 అడుగుల నుండి 19 అడుగులకు చేరుకుంది. దీంతో రిజర్వాయర్ పూర్తిస్థాయి నిండుకుని అలుగులు పారుతున్నాయి. ఒకవైపు రైతులు హర్షం వ్యక్తం చేస్తూనే మరో వైపు వరదతాకిడికి స్నానాల లక్ష్మీపురం, ముసలిమడుగు గ్రామాలు మునక ప్రమాదం వస్తుందేమోనని ఆయా గ్రామాల ప్రజలు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిజర్వాయర్ నీరు కుడి - ఎడమ కాల్వల ద్వారా నీటిని వృథాగా వదులుతున్నప్పటికీ, అలుగుల ద్వారా పొంగి పొర్లుతున్నప్పటికీ ఏక్షణంలో రిజర్వాయర్ ఎగువ ప్రాంతాలనుండి వచ్చే వరదలతాకిడికి మునక ప్రజలు ఎమవుతామోనని భయాందోళనలు చెందుతున్నారు.
అధికారులకు ఆదేశాలు....
రిజర్వాయర్ వరద ముంపు గ్రామాలైన స్నానాల లక్ష్మీపురం, ముసలిమడుగు గ్రామాలకు వరద ముంపు ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతేకాదు రిజర్వాయర్‌కు వచ్చే వరద పట్ల ఎప్పటికప్పుడూ తనకు తెలియజేయాలని అన్నారు. ఒకవేళ పరిస్థితి చక్కదిద్దేందుకు అవసరమైతే ఏరాత్రి సమయంలోనైనా ఆయా గ్రామాల ప్రజలను పిల్లజల్లలతో వైరాకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన అధికారులకు సూచించారు. పోలీసులు కూడా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
ప్రజలను విస్మరిస్తున్న పాలకులు

ఖమ్మం, ఆగస్టు 13: కేంద్ర, రాష్ట్ర పాలకులు ప్రజలను విస్మరించి పరిపాలన సాగిస్తూ మాటల గారడితో ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఎన్నికల హమీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఖమ్మం నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఆందోళనకారులను కలెక్టరేట్ వైపు వెళ్ళనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ ఏ పథకాన్ని పూర్తిగా అమలు చేయలేని కెసిఆర్ మాటల గారడితో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ప్రశ్నించే వారు లేకుండా కుట్రపూరిత చర్యలకు పాల్పడుతున్నారన్నారు. లక్షల సంఖ్యలో పేద ప్రజలకు రెండు పడకల గదులు అవసరం కాగా ఆ స్థాయిలో వాటిని నిర్మించడం లేదని, నిర్మించిన కొన్ని కూడా నాణ్యత లోపంతో ఉన్నాయన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామంటూ అధికారంలోకి వచ్చిన కెసిఆర్ కనీసం ఊరికో ఉద్యోగం కూడా ఇచ్చే పరిస్ధితిలో లేరని, ఉపాధి, ఉద్యోగాలు లేక యువత నిరాశలో ఉన్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు ఆరోపించారు. గడిచిన నాలుగు ఏళ్ళలో కెసిఆర్, మోడి సర్కర్ సాధించింది ఏమీలేదన్నారు. రాష్ట్రంలో విద్యా, ఉపాధి రంగాలకు సంబందించి విడుదలైన ప్రతి నోటిఫికేషన్ వెనుక అవినీతి దాగిఉందన్నారు. గొర్రెలు, బర్రెలు, చేపలు అంటూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం దళారులను ప్రోత్సహించి నిజమైన లబ్ధిదారులకు అన్యాయం చేస్తుందన్నారు. మాటలతో ప్రజలను నమ్మించి గద్దెనెక్కి వారిని విస్మరించిన మోడి, కెసిఆర్‌లకు ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. తెలంగాణ ప్రజలకు పోరాటం కొత్తకాదని అవసరమైతే పాలకుల విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు వెనుకాడమని పేర్కొన్నారు. కలెక్టరేట్ ముట్టడి సందర్భంగా జడ్పిసెంటర్‌లోనే సిపిఐ కార్యకర్తలను అరెస్టు చేసి నగరంలోని 1వ, 2వ, 3వ, అర్బన్ పోలీస్ స్టేషన్‌లకు వారిని తరలించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పోటు ప్రసాద్, వౌలానా, సింగు నర్సింహారావు, జితేందర్‌రెడ్డి, జానీమియా, సలాం, క్లెమెంట్, సీతామహలక్ష్మి, విజయమ్మ, బాబు, రమేష్, గోవిందరావు, కరుణకుమార్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.