ఖమ్మం

మత్స్యకారుల అభివృద్ధే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూసుమంచి, ఆగస్టు 14: మత్స్యసంపద వృద్ధిచేయడం ద్వారా మత్స్యకారుల జీవితాలు అబివృద్ధిలోకి వస్తాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం పాలేరు జలాశయంలో 3.11లక్షల చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3కోట్ల50లక్షల చేపిల్లలకు 2కోట్ల50లక్షల రుపాయలు ఖర్చుచేశామని చెప్పారు. ఖమ్మం జిల్లా మత్స్యశాఖకు 36కోట్ల రుపాయలు ఖర్చు పెట్టామని తెలిపారు. వీటి ద్యారా మత్స్యకారులకు ఈ నెల చివరివరకు ద్విచక్రవాహనాలు, వలలు, రవాణకొరకు డిసిఎం వాహనాలు, మహిళలకు రివాల్వింగ్‌పండ్ , ప్లాస్టిక్‌వలలు కూడా అందిస్తారని తెలిపారు. కెజ్‌కల్చర్‌లు ప్రస్తుతం పాలెరులో9, వైరాలో2, లంకసాగర్‌లో2ఉండగా పాలేరులో ఇంకోక 5యూనిట్లు పెంచుతామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రికి మత్స్యకారులు పలు సమస్యలు వివరించారు. తమకు గత సంవత్సరం మార్కెటింగ్ సమస్యవల్ల చేపలను తక్కువ ధరకు అమ్మవలసిన పరిస్తితి ఎర్పడిందని, కావుర తమకు ఖమ్మంలో కొల్డ్‌స్టొరెజ్‌ను మంజూరు చేయవలసిందిగా కొరారు. కొంతమంది గిరిజనులు తమ భూములు కూడా పాలేరు కాలువకింద పోయాయని కావున తమకు కూడా మత్స్యసొసైటిలో సభ్యత్వం ఇప్పించిలని మంత్రిని కోరారు. వెంటనే స్పందించిన మంత్రి మత్స్యశాఖ ఎడిని సమస్యలు పరిష్కరించవలసిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్‌పి చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఐడిసి చైర్మన్ బుడాన్ బేగ్, ఎస్‌సి కార్పొరెషన్ చైర్మన్ పిడమర్తి రవి, తెలంగాణ రాష్ట సమితి కార్యదర్శి తాతామధు, ఆర్‌డిఒ పూర్ణచందర్‌రావు, జడ్‌పి సిఇఒ మరుపాక నగేష్, ఎంపిపి రాంసహయం వెంకటరెడ్డి, నాయకులు వీరవెల్లి నాగేశ్వరరావు, జొన్నలగడ్డరవి, జూకూరి గొపాలరావు, బొల్లంపల్లి సుధాకర్‌రెడ్డి, ఎండి ఆసీప్‌పాషా, మాదాసు ఉపేందర్, వీరభద్రం అధికారులు తదితరులు పాల్గొన్నారు.