ఖమ్మం

కంటి వెలుగుకు సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(మామిళ్ళగూడెం), ఆగస్టు 14: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కొండలరావు అన్నారు. స్థానిక డిఎంఅండుహెచ్‌ఓ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంధత్వరహిత సమాజమే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. రోజు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు కంటి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రతిటీంలో 11మంది వైద్యులు, 28మంది ఆప్ధాలిస్టులు, 16మంది డేటాఎంట్రీలతో పకడ్భందిగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి కంటివైద్య పరీక్షల కేంద్రంలో 5రూంలలో 5దశలుగా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. మండలానికి 1యూనిట్‌గా తీసుకొని వెయ్యిలోపు జనాభా కలిగిన ప్రాంతాలలో ప్రస్తుతం ఏర్పాటు చేశామన్నారు. మొదటి దశలో 1వ రూంలో ఎఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు రోగి రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపడతారని, రెండవ టేబుల్లో దృష్టి లోపాన్ని గుర్తించి మూడవ టేబుల్‌కు పంపిస్తామని అక్కడ సిబ్బంది పర్యవేక్షించి క్షుణంగా పరీక్షించి నాల్గవ టేబుల్‌కు పంపుతారని ఈ టేబుల్‌వద్ద అప్థాలిక్ అధికారి ఆటోరిప్లెక్టర్ మిషన్ ద్వారా పరీక్షలు నిర్వహించి అవసరమైన కళ్ళద్దాలను ఖరారు చేస్తారని తెలిపారు. ఆపరేషన్ అవసరమనిపిస్తే స్థానిక ప్రభుత్వాసుపత్రి, మమత, అఖిల ఆసుపత్రులకు సిఫార్స్ చేస్తామన్నారు. 5టేబుల్ వద్ద ఆధార్‌కార్డు వివరాలను నమోదు చేసి బార్‌కోడింగ్ ఇచ్చి సదుపరి వైద్యసేవలు అందిస్తారన్నారు. ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని కంటివైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు.

ప్రజల జీవితాలలో వెలుగులు
* మంత్రి తుమ్మల
ఖమ్మం రూరల్, ఆగస్టు 14: రాష్ట్రంలోని ప్రజలందరి జీవితాలలో వెలుగులు నింపడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం మండలంలో నూతన గ్రామపంచాయతీగా ఆవిర్భవించిన గొల్లగూడెం గ్రామంలో నిర్మించి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళను ఆయన ప్రారంభించారు. అదేవిధంగా అదనంగా మంజూరు చేసిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ నిర్మాణాలకు కూడా శంకుస్థాపన చేశారు అనంతరం కొండాపురం - యర్రగడ్డ గ్రామాల మధ్య నిర్మించనున్న బిటి రోడ్డు నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. ఈసందర్భంగా జరిగిన సభలల్లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అతికొద్ది కాలంలో నిర్మించిన భక్తరామదాసు పథకం ద్వారా పాలేరు నియోజకవర్గంలోని వేలాది ఎకరాల భూములు సాగులోకి వచ్చాయన్నారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా వచ్చే సంక్రాంతి నాటికి ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీటిని సరఫరా చేయనున్నట్టు తెలిపారు. గ్రామాలలో ఇళ్లులేని నిరుపేదలకు రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వమే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళను నిర్మించి గృహప్రవేశాలు కూడా చేయిస్తుందన్నారు. రైతులను ఆదుకునేందుకు పట్టాదారు పాస్‌బుక్‌లతో పాటు రైతుబీమా, పెట్టుబడి సాయం, 24 గంటల కరెంట్‌ను అందజేస్తుందన్నారు. కళ్యాణలక్ష్మి పథకం ద్వారా లక్షా 16వేల రూపాయలను పెళ్లికానుకగా అందిస్తున్నట్టు చెప్పారు. ఆగస్టు 15 నుండి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా శస్త్ర చికిత్సలతో పాటు మందులను పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఐడిసి చైర్మన్ బుడాన్‌బేగ్, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, జిల్లా ఆర్‌ఎస్‌ఎస్ కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు వౌలానా, ఎంపిపి లలిత, ఆత్మ చైర్మన్ మద్ది మల్లారెడ్డి, ఆర్డీవో పూర్ణచందర్‌రావు, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణు, మంకెన నాగేశ్వరరావు, సొసైటీ డైరెక్టర్ మట్టా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.