ఖమ్మం

నేటి నుండి ‘కంటి వెలుగు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఆగస్టు 14: తెలంగాణ రాష్ట్రాన్ని అంధత్వ నివారణ రాష్ట్రంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటివెలుగు కార్యక్రమం నేటి నుండి ప్రారంభం కానుంది. ఇప్పటికే రైతుబీమా పథకాన్ని ఇదే రోజు నుండి ప్రారంభిస్తున్న ప్రభుత్వం ప్రజలందరికి కంటి పరిక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, కళ్ళజోళ్ళు అందించటమే కాకుండా అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేసేందుకు ఏర్పాట్లు చేసింది. జిల్లాలో 14,39,410మంది జనాభా ఉండగా వీరందరి కోసం 363గ్రామాల్లో ప్రత్యేక కంటివెలుగు శిభిరాలను నిర్వహించనున్నారు. గత 116రోజుల పాటు నిర్విరామంగా సాగే ఈ శిభిరాలను ఖమ్మం జిల్లా ఆసుపత్రితో పాటు 4కమ్యూనిటి హెల్త్ సెంటర్లు నిరంతరం నిర్వహిస్తారు. ఇందు కోసం 36వైద్య బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రతి బృందంలో 12మంది సిబ్బంది సేవలు అందించనున్నారు. తొలుత గ్రామాల్లో ఏర్పాటు చేసిన శిభిరాల్లో పేర్ల నమోదు, ఆపై కంటి పరిక్ష నిర్వహించి అవసరమైన వారికి కళ్ళజోళ్ళను, మందులను అక్కడే అందిస్తారు. శస్త్ర చికిత్సల కోసం ఖమ్మం ప్రభుత్వాసుపత్రితోపాటు మమత, అఖిల ఆసుపత్రితో పాటు పాల్వంచలోని ఎల్‌వి ప్రసాద్ సేవలను వినియోగించుకుంటారు. అవసరాన్ని బట్టి హైదరాబాద్‌లోని సరోజినిదేవి, ఎల్‌వి ప్రసాద్ ఆసుపత్రులకు రోగులను పంపించనున్నారు. శిబిరాలకు వచ్చే ప్రజలకు అన్ని సౌకర్యాలను కల్పించటంతో పాటు ప్రభుత్వ పథకంపై అవగాహన కూడా కల్పించనున్నారు. ఇందు కోసం ప్రత్యేక సిబ్బందిని నియమిస్తున్నారు. ఆయా గ్రామాల్లో స్థానిక శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులతో శిబిరాలను ప్రారంభించి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనేలా ముందుస్తుగానే చర్యలు చేపడుతున్నారు.
ఇదిలా ఉండగా ప్రభుత్వ అందించే కళ్ళజోళ్ళు నాణ్యమైనవిగా నిర్ధారించారు. ప్రపంచ వ్యాప్తంగా కళ్ళజోళ్ళ తయారిలో పేరు పొందిన ఎస్‌ఎల్‌ఆర్ కంపెనీ నుండి వీటిని తెప్పించారు. జిల్లాకు ఇప్పటికే 1.59లక్షల కళ్ళజోళ్ళు వచ్చి ఉన్నాయి. దృష్టిలోపానికి అనుగుణంగా 1నుండి 25పాయింట్ల వరకు అద్దాలను అమర్చిన కళ్ళజోళ్ళను సిద్దం చేశారు.
కాగా జిల్లాలో 363గ్రామాల్లో ప్రత్యేక శిభిరాలను ఏర్పాటు చేయనున్నారు. తొలుత మండలాన్ని యూనిట్‌గా తీసుకొని వెయ్యిలోపు జనాభా ఉన్న గ్రామాలలో పరిక్షలు నిర్వహిస్తారు. వెయ్యికి పైగా జనాభా ఉన్న గ్రామాల్లో రెండేసి బృందాలు పర్యటిస్తాయి. ప్రభుత్వ పాఠశాలలు, కమ్యూనిటి హెల్త్ సెంటర్లు ఖాళీ స్థలాలో టెంట్లు వేసి శిభిరాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి వైద్య బృందంలో వైద్యాధికారి, ఫార్మసిస్టు, ఆప్తాల్మిక్, స్ట్ఫా నర్స్, ఆశా, అంగన్‌వాడి కార్యకర్తలు ఉంటారు. మరికొంతమంది శిక్షణ పొందిన వారిని కాంట్రాక్ట్ పద్దతిపై తీసుకుంటున్నారు. వైద్య బృందాలకు వాహనాలతో పాటు అవసరమైన సౌకర్యాలను పంపిస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులను, ఆయా పార్టీల నేతల సహకారాన్ని తీసుకోవాలని నిర్ణయించారు. అర్హులైన వారందరికి మందులు, కళ్ళజోళ్ళు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర రోడ్డు భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నగరంలో బుధవారం కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.