ఖమ్మం

పటిష్ఠంగా తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(క్రైం), ఆగస్టు 17: మరుగున పడిపోతున్న కబడ్డీ ఆట పునరుద్ధరణకు చర్యలు తీసుకొని గ్రామీణ స్థాయి నుండి రాష్టస్థ్రాయి వరకు కబడ్డీ క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి ఎ ఊశిరెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కబడ్డీ క్రీడను గ్రామీణ స్థాయినుండి ప్రాత్సాహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు గాను మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు పటిష్టమైన కమిటీలను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. అందులో బాగంగా ఖమ్మం జిల్లాలో అధ్యక్షులుగా బొర్ర తిరపయ్య, ప్రధానకార్యదర్శిగా బండ్ల రాంబాబును ఎన్నుకున్నట్లు తెలిపారు. గతంలో రాష్ట్ర కమిటీలో పనిచేసిన జగదీష్‌యాదవ్ వ్యక్తగత అభివృద్ధికి, స్వప్రయోజనాలకు పాల్పడి కబడ్డి క్రీడను, క్రీడాకారులను ప్రోత్సాహించక పోవడం వలన రాష్ట్రంలో ఎంతో నష్టం జరిగిందన్నారు. ఇకనుండి కబడ్డీ క్రీడను, 20సంవత్సరాలలోపు క్రీడాకారులను ప్రోత్సాహించి రాష్ట్ర స్థాయిలో ప్రతిభను నిరూపించేందుకు ప్రస్తుత కమిటి ప్రతిన బూనినట్టు తెలిపారు. ఈ విలేఖరుల సమావేశంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షకార్యదర్శులు నారాయణరెడ్డి, రవీందర్‌రెడ్డి, రామారావు, రత్న, గోపాల్‌రావు, టి నరసింహారావుదొర, వి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

వాజ్‌పేయి చిరస్మరణీయుడు
* టియూడబ్ల్యూజే(ఐజెయూ)
ఖమ్మం(క్రైం): భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి చిరస్మరణీయుడని టియూడబ్ల్యూజే(ఐజెయూ) జాతీయ నాయకులు కట్టెకోల రాంనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రధానిగా అనేక సంస్కరణలను తీసుకొచ్చారన్నారు. ప్రలోభాలకు లొంగని మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. విద్యార్థి దశనుండి రాజకీయాలలో చురుకుగా పాల్గొని తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారన్నారు. వాజ్‌పేయి తొలుత పాత్రికేయ వృత్తిద్వారా ప్రారంభించి రాజకీయాలలో అంచెలంచలుగా ఎదిగి వివిధ హోదాల్లో పనిచేసిన మహానీయుడన్నారు. క్రమశిక్షణ, పట్టుదల గల కొద్దిమంది రాజకీయ నేతల్లో వాజ్‌పేయి ఒకరు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు మాటేటి వేణు, తాళ్ళూరి మురళీకృష్ణ, యూనియన్ రాష్ట్ర, జిల్లా నాయకులు ఏనుగు వెంకటేశ్వరావు, నర్వనేని వెంకట్రావు, గోగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, యేగినాటి మాధవరావు, నంచర్ల జనార్థనాచారి, కూరాకుల గోపి, వనం వెంకటేశ్వర్లు, ఆవుల శ్రీనివాస్, సిహెచ్ శ్రీనివాసరావు, నామా పురుషోత్తం, కొరకొప్పుల రాంబాబు, శ్రీనివాసరావు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.