ఖమ్మం

అధికార యంత్రాగాన్ని అప్రమత్తం చేశాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, ఆగస్టు 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని భద్రాచలం సమీపంలో గోదావరి వరదల వలన జరిగే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గోదావరి పరీవాహక ప్రాంతంలోని ప్రజలు ఎలాంటి ఆందోళనలకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి నీటి ప్రవహం అధికమైందని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాలలో సెక్టోరియల్ అధికారులను నియమించి అవసరమైన సహాయ కార్యక్రమాలకు సిద్ధం చేశామని అన్నారు. గోదావరి వరద ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశామని, అధికారులు ఎప్పటికప్పుడు వరద అంచనా వేస్తూ పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. భద్రాచలంలో రెండుచోట్ల ప్రత్యేక బృందాలను, దుమ్ముగూడెంలో మరో బృందాన్ని నియమించామని అన్నారు. రెవెన్యూ అధికారులు లోతట్టు ప్రాంతాలలో పర్యటిస్తూ వరద ముంపునకు గురయ్యే ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారని తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. పునరావాస కేంద్రాల ఏర్పాటుతో పాటు వైద్య శిబిరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అధికారులంతా అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు.