ఖమ్మం

పర్ణశాల, దుమ్ముగూడెం వద్ద ఉధృతంగా గోదావరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుమ్ముగూడెం, ఆగస్టు 17: ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు మండల పరిధిలోని పర్ణశాల, దుమ్ముగూడెం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి ఉధృతికి సీతవాగులోకి వరద నీరు ప్రవేశించి నారచీరెల ప్రదేశం ఎగపోటు వల్ల నీట మునిగింది. అక్కడ ఉన్న సీతమ్మ విగ్రహాలు, నారచీరెల ప్రాంతం, దుకాణ సముదాయం నీట మునిగాయి. అలాగే సున్నంబట్టి, బైరాగులపాడు గ్రామాల మధ్య ఉన్న రహదారిపై గోదావరి వరద చేరింది. దీంతో సున్నంబట్టి గ్రామానికి మండల కేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. సున్నంబట్టి, బైరాగులపాడు, సీతానగరం తదితర గ్రామాల వద్ద పంటపొలాలు నీటిలో మునిగాయి. శుక్రవారం సాయంత్రం దుమ్ముగూడెం హెడ్‌లాక్స్ వద్ద గోదావరి నీటిమట్టం 22 అడుగులకు చేరి నిలకడగా ఉంది. మండల తహసిల్దార్ బి.హరిచంద్, ఎంపీడీవో బెక్కంటి శ్రీనివాసరావులు సున్నంబట్టి, పర్ణశాల గ్రామాలను పరిశీలించారు. సున్నంబట్టి గ్రామంలో ప్రజలతో మాట్లాడుతూ భద్రాచలం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ అయితే గ్రామంలోని ప్రజలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లాలని తెలిపారు. అక్కడ మునిగిన పంటపొలాలను పరిశీలించారు. అలాగే పర్ణశాల వద్ద గోదావరి ఉధృతిని పరిశీలించి పుష్కరఘాట్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేకాధికారి, సీడీపీవో కనకదుర్గను, కార్యదర్శి ఖాదర్‌మియాకు ఆదేశాలు ఇచ్చారు. గోదావరి పరివాహక గ్రామాల్లో పర్ణశాల, దుమ్ముగూడెంనకు చెందిన పీహెచ్‌సీ వైద్య బృందాలు ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహిస్తున్నారు. సీజనల్ వ్యాధులు, జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. సీతానగరం, గోవిందాపురం తదితర గ్రామాల్లో సీడీపీవో ఆధ్వర్యంలో శానిటేషన్ పనులు చేపట్టారు.

చలో రాజధాని
* క్యూ కడుతున్న ఆశావహులు

ఖమ్మం, ఆగస్టు 17: ఎన్నికలు త్వరలోనే జరుగుతాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయా పార్టీల నుంచి టిక్కెట్లు ఆశిస్తున్న నేతలు హైదరాబాద్‌కు క్యూ కడుతున్నారు. తాము అనుకున్న పార్టీ నుంచి టిక్కెట్ సంపాదించేందుకు తమకు అనుకూలమైన నేతల ద్వారా లాబీయింగ్ జరుపుతూ రాజధానిలో మకాంవేసి పావులు కదుపుతున్నారు. ప్రస్తుత శాసన సభ్యులతో పాటు శాసన మండలి సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు తాము ఉన్న పార్టీ నుంచి తిరిగి అదేస్థానంలో పోటీ చేసేలా అధిష్టానం నుంచి మద్దతు తీసుకునేందుకు ఆరాటపడుతున్నారు. సిట్టింగ్ సభ్యులతో పాటు ఇతర వర్గాలకు చెందిన వారు కూడా ఎమ్మెల్యే స్థానానికి పోటీ పడుతుండటంతో కొన్ని చోట్ల నేతల వైఖరికి అధిష్టానానికి తలనెప్పిగా మారింది. ప్రధానంగా అధికార టిఆర్‌ఎస్ అభ్యర్థులుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పోటీగా వైరా, ఇల్లెందు, పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో ఎక్కువ మంది ప్రయత్నిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే పోటీ పడేవారి సంఖ్య అధికంగా ఉంది. మధిర మినహ అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీపడేవారి సంఖ్య అధికంగా ఉండటంతో ఆ పార్టీ అధిష్టానం ఇబ్బంది పడుతున్నది. పోటీలో ఉన్నవారంత కాంగ్రెస్ పార్టీలోని ప్రధాన నేతను ఆశ్రయించి తమకు టిక్కెట్ వచ్చేలా ప్రయత్నం చేసుకుంటుండటం గమనార్హం. కొంతమంది నేతలు ఢిల్లీలో మకాం వేసి టిక్కెట్ సాధించేందుకు విస్తృతస్థాయిలో ప్రయత్నిస్తున్నారు. ఇందులో కొందరు వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. మరికొంత మంది ఇతర జిల్లాలకు చెందిన వారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోటీ చేసేందుకు ప్రయత్నిస్తుండటం విశేషం. కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీ అధిష్టానమే ప్రధానమైనదని భావిస్తున్న నేతలు ఆ దిశగా అధిష్టానాన్ని ఒప్పించేందుకు విస్తృతస్థాయిలో కొంతమంది ఢిల్లీలో ఉండి ప్రయత్నిస్తుండటం గమనార్హం.
మరొవైపు తెలుగుదేశం పార్టీలో కూడ పోటీపడేవారి సంఖ్య అధికంగానే ఉంది. పొత్తులు కుదిరితే సత్తుపల్లి మినహ మిగిలిన నియోజకవర్గాల్లో కొన్నిచోట్ల పోటీ చేసే అవకాశం వస్తుందని తద్వారా పార్టీతో పాటు తమకు కలసివస్తుందని భావించి ముందస్తుగానే టిక్కెట్ సంపాదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గత నాలుగు రోజులుగా టిక్కెట్లు ఆశించే వారంతా రాజధానిలోనే మకాం వేయడంతో వారి అనుచర వర్గం జిల్లాలో తమనేతకు టిక్కెట్ వచ్చినట్లేనని ప్రచారం చేస్తుండటం గమనార్హం.