ఖమ్మం

అంగన్‌వాడీల శ్రమ దోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, సెప్టెంబర్ 17: సమాన పనికి సమాన వేతనం చెల్లించకుండా, చట్టబద్ధమైన హక్కులు కల్పించకుండా అంగన్‌వాడీల శ్రమ దోపిడీకి పాలకవర్గాలు పాల్పడుతున్నాయని అంగన్‌వాడీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకురాలు సీతామహాలక్ష్మి ఆరోపించారు. మినీ అంగన్‌వాడీ టీచర్ల సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లాలో రెండు రోజులు నిర్వహించిన మహా పాదయాత్ర సోమవారం కొత్తగూడెంకు చేరింది. ఈ పాదయాత్ర బృందానికి సిపిఐ, ఎఐటియుసి నాయకులు ఇల్లెందు క్రాస్‌రోడ్డు వద్ద ఘన స్వాగతం పలికారు. పాదయాత్ర క్రాస్‌రోడ్డు నుండి ప్రదర్శనగా ధర్నాచౌక్ వరకు సాగి ధర్నా చౌక్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీతామహాలక్ష్మి మాట్లాడారు. 16 సంవత్సరాలుగా పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు ఎనలేని సేవలు అందిస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్న మినీ అంగన్‌వాడీ టీచర్లపై రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని విమర్శించారు. కనీసం మినీ టీచర్లకు ఆయాలను కేటాయించకపోవడంతో రెండు విధులు నిర్వహిస్తున్నప్పటికీ వారి శ్రమను ప్రభుత్వం గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణ సెలవులు, వేసవి సెలవులు వర్తింప చేయకుండా మినీ అంగన్‌వాడీలతో ఊడిగం చేయించుకోవడం సరైంది కాదన్నారు. గత ఏడాది రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన కేంద్రాల టీచర్లకు, ఆయాలకు వేతనాలు పెంచి మినీ టీచర్లను విస్మరించి అవమానించారని అన్నారు. సమాన పనికి సమాన వేతనాలు, శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా మినీ అంగన్‌వాడీలు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అంగన్‌వాడీల సమస్యల సాధనకు పెద్దఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నరాటి ప్రసాద్, గుత్తుల సత్యనారాయణ, కార్యదర్శులు కంచర్ల జమలయ్య, ఆదాం, దేవరకొండ శంకర్, సునిల్, నాగమణి, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు ఈసం రమాదేవి, పాయం రత్నకుమారి, వసంత, విమల, సావిత్రి, వెంకటరమణ, శ్రీలత, వసంత, జాన్సీ, దేవి, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.