ఖమ్మం

గణేష్ నిమజ్జనానికి పటిష్ఠ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(క్రైం), సెప్టెంబర్ 17: గణేష్ నిమజ్జనంను పురస్కరించుకొని పోలీస్, రెవెన్యూ, ఆర్ అండ్ బి, వైద్య, దేవాదాయశాఖ, శానిటేషన్ శాఖల సమన్వయంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టిట్లు టౌన్ ఏసీపీ గంటా వెంకట్రావు తెలిపారు. సోమవారం నిమజ్జన ప్రాంతం మునే్నరు పరిసరాలను నగర మేయర్ పాపాలాల్, కమిషనర్ శ్రీనివాస్‌లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ఆదేశాలమేరకు గణేష్ నిమజ్జన ఏర్పాట్లను చేస్తున్నామన్నారు విగ్రహాలు నిమజ్జనం చేసేందుకు భారీ క్రేన్స్, భారీ కేడ్లను ఏర్పాటుచేసి నిరంతరం పోలీస్ పర్యవేక్షించనున్నదని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తిన వెంటనే స్పందించేందుకు పోలీస్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటుచేస్తున్నామన్నారు. వివిధ శాఖల సమన్వయంతో మంచినీటి సౌకర్యం, హెల్త్‌క్యాంపు, హైవే అంబులెన్స్, ఫైర్ ఇంజన్ అందుబాటులో ఉంచుతామన్నారు. ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా బారీకేడ్లు ఏర్పాటుచేసి వన్‌వేలో వాహనాలు వెళ్ళేందుకు రోడ్లను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. అర్థరాత్రి వరకు నిమజ్జనంకు అధికంగా విగ్రహాలు రానున్న నేపద్యంలో నిమజ్జనానికి వచ్చే కమిటీ సభ్యులు, ప్రజలు పోలీస్ వారి సూచనలు పాటించి నిమజ్జనం సజావుగా సాగేందుకు సహాకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.