ఖమ్మం

విధినిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, సెప్టెంబర్ 21: విధినిర్వహణలో అలసత్వం వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని కలెక్టర్ రజత్‌కుమార్‌షైనీ హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయ అధికారులు, ఎంపీడీఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో అధికారులు సమర్ధవంతంగా పనిచేయాలన్నారు. కొత్త ఓటర్ల నమోదు కొరకు వచ్చిన దరఖాస్తులను ఆదివారం నాటికి ఆన్‌లైన్ చేయాలని, ఆన్‌లైన్ ప్రక్రియకు అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సిబ్బంది కొరత అనే పేరుతో విధులను నిర్లక్ష్యం చేయవద్దన్నారు. జిల్లాలో ఎన్నికల పరిశీలకులు పర్యటించే అవకాశం ఉన్నందున ఆర్‌ఓలు, ఎఆర్‌ఓలు ఎన్నికలకు సంబంధించి సమగ్ర సమాచారం కలిగి వుండాలన్నారు. ఈనెల 25 వరకు మాత్రమే కొత్తఓటర్ల ప్రక్రియ కార్యక్రమం కొనసాగే అవకాశం ఉన్నందున పనులను వేగవంతం చేయాలన్నారు. ఓటర్ జాబితాను తొలగించాల్సివస్తే తప్పనిసరిగా నోటీసులు జారీచేసి సంబంధిత వ్యక్తుల నుండి వివరణ తీసుకున్న అనంతరమే ఓటర్ జాబితా నుండి ఓటు తొలగించాలన్నారు. అక్టోబర్ 8న తుది ఓటర్ ముసాయిదాను ప్రకటించనున్నందున కొత్త ఓటర్ల నమోదు, చేర్పులు, మార్పులు, బోగస్ ఓటర్ల తొలగింపుప్రక్రియపై యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. పోలింగ్ కేంద్రాలను ఎంపిడిఓలు పరిశీలించి నివేదికను నాలుగురోజుల్లో అందజేయాలన్నారు. ఎన్నికల విధుల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా బాధ్యతగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ఆన్‌లైన్‌లో ఇబ్బందులు ఉంటే ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలన్నారు. ఈసమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె వెంకటేశ్వర్లు, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి పమేలా సత్పతి, సబ్‌కలెక్టర్ భవేష్‌మిశ్రా, అసిస్టెంట్ కలెక్టర్ ఐలాత్రిపాటి, డిఆర్‌డిఓ పిడి జగత్‌కుమార్‌రెడ్డి, కొత్తగూడెం ఆర్డీఓ స్వర్ణలత, ఎన్‌డిసిలు లక్ష్మణస్వామి, శ్రీరాములు, తహశీల్ధార్లు, ఎంపిడిఓలు పాల్గొన్నారు.