ఖమ్మం

ప్రాజెక్టులొద్దంటున్న వారికి ఓట్లెలావేస్తారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం రూరల్, మే 3: తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణాలాపాలని క్యాబినెట్‌లో తీర్మానించిన చంద్రబాబునాయుడు, దీక్ష చేయాలనుకున్న జగన్‌మోహన్‌రెడ్డి పార్టీలు, మద్దతు తెలుపుతున్న కాంగ్రెస్ పార్టీకి ఓట్లెలా వేస్తారని రాష్ట్ర రవాణాశాఖామంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం పాలేరు నియోజకవర్గ పరిధిలోని కైకొండాయిగూడెం, రామన్నపేట, కామంచికల్లు, దారేడు, తీర్థాల, మంగళగూడెం, గోళ్లపాడు, ఎంవిపాలెం, గూడూరుపాడు, తనగంపాడు, కస్నాతండా, కాచిరాజుగూడెం, ఆరెకోడు, ముత్తగూడెం, ఏదులాపురం, పెద్దతండా గ్రామాలలో ఆయన బోడేపూడి రమేష్, మద్ది మల్లారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు దారావత్ రామ్మూర్తినాయక్, బెల్లం వేణు, గుర్రం వెంకట్రామయ్య, కొప్పుల ఆంజనేయులు తదితరులు పర్యటించారు. ఈసందర్భంగా ఆయా గ్రామాలలోని పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుసుకొని స్థానిక రాజకీయ పరిస్థితులను తెలుసుకున్నారు. ఈసందర్భంగా గోళ్లపాడులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ప్రాజెక్టులన్నీ ఆంధ్రాలో కట్టుకొని, తెలంగాణాకు అన్యాయం చేశారని ఆరోపించారు. తెలంగాణ నుంచి వేరుపడ్డాక ఆంధ్రా పాలకులు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. దుష్టబుద్ది ఉన్న బాబు, జగన్ పార్టీలు బలపరుస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి మోసపోవద్దని, ఓట్లేసేముందు ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సోనియాగాంధీ ఇచ్చిందని చెప్పుకున్న ఆపార్టీ సరైన బలాన్ని పుంజుకోలేకపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో కెసిఆర్ చేసిన, చేస్తున్న అభివృద్ధి పథకాలకు ఆకర్శితులై అన్ని పార్టీల నుంచి వేలాదిగా కార్యకర్తలు టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. అభివృద్ధికి మారుపేరుగా నిలిచిన టిఆర్‌ఎస్ పాలేరు అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుకు అఖండ విజయాన్ని చేకూర్చి టిఆర్‌ఎస్ బలమేమిటో నిరూపించాలని ఆయన కోరారు. సమావేశంలో నాయకులు మద్ది యల్లారెడ్డి, సర్పంచ్ యల్లయ్యనాయక్, రామ్మోహన్‌రావు పాల్గొన్నారు.