ఖమ్మం

కాంగ్రెస్ ఆశావహుల ఆశలు ఫలించేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గార్ల, సెప్టెంబర్ 27: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇల్లందు రిజర్వుడు నియోజక వర్గం నుంచి ముందస్తు ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆశావహుల ఆశల ఫలిస్తాయా? లేదా? అనే సందిగ్ధం నెలకొంది. ఎలాగైన టికెట్ సాధించి పోటీ చేయాలని గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆయా నియోజక వర్గాల నుంచి పోటీ చేసి ఓడిన కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలకు చెందిన నాయకులు సాగిస్తున్న ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీట్ల కేటాయింపు నిర్వహిస్తుందా లేక ప్రస్తుతం రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీని ఓడించేందుకు మహాకూటమిలో మరో పార్టీ అభ్యర్థికి కేటాయింపుజరుపుతుందా అనేది తెలయని అయోమయ స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఆశావహులున్నారు. ఇల్లందు నియోజక వర్గం నుంచి భూక్య రాంచంద్రునాయక్, బానోతు హరిప్రియ, చీమల వెంకటేశ్వర్లు, జర్పుల భీముడునాయక్, గుగులోతు కిషన్ నాయక్, భూక్య దళ్‌సింగ్, రాంమూర్తి, రూపాబాయి, గుగులోతు రవి తదితరులుండాగా ఇందులో రాంచంద్రునాయక్ మాత్రం స్థానికేతరుడుగా ఉన్నారు. రాష్ట్రంలో పట్టుసాధించి తిరిగి అధికారం కైవసం చేసుకోవాలనే ధృడసంకల్పంతో టీఆర్‌ఎస్ పార్టీ ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటించి ప్రచారం కొనసాగిస్తుండగా కాంగ్రెస్ పార్టీ మహాకూటమి పేరుతో సంప్రదింపులు సాగిస్తూ కాలయాపన చేస్తుందని పార్టీ కార్యకర్తలు మనోవేదన చెందుతున్నారు. ఆలస్యమైన గ్రామీణ ప్రాంత ఓటర్లలో పట్టు, ఖ్యాతి కలిగిన వ్యక్తిని అభ్యర్థిగా ఎంపిక చేయాలని, స్థానికేతరులకిస్తే పార్టీ అధోగతి పాలు కావటం ఖాయమని పార్టీ కార్యకర్తలు అంటున్నారు. గతంలో ఇల్లందు నియోజక వర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి కాలైన బానోతు హరిప్రయ, కాంగ్రెస్ పార్టీ నుంచి వైరా నియోజక వర్గ నుంచి బరిలోకి దిగి తీవ్రపరాభవ పాలైన భూక్య రాంచంద్రునాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ ఆశిస్తూ ప్రయత్నాలు చేస్తున్న వీరి ఆశలు అశలు సఫలికృతమైయో లేదోనని కార్యకర్తలు ఎదురు చూపులు చూస్తున్నారు. ఇల్లందులో ప్రస్తుతం ప్రచారం సాగిస్తున్న కోరం కనకయ్య ధీటుగా కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థిని నియమించింతే తప్ప గెలిచే అవకాశం లేదని కార్యకర్తలు అంటున్నారు. పైరవీలకు తావులేకుండా నియోజక వర్గంలో పార్టీ ప్రతిష్టనిలిపే అభ్యర్థిని నియమించే విధంగా అధిష్ఠానం చర్యలు చేపట్టాలని కార్యకర్తలు కోరుతున్నారు.