ఖమ్మం

ప్రజలకు, దొరలకు మధ్య పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధిర, అక్టోబర్ 14: తెలంగాణాలో డిసెంబర్ 7న జరగనున్న ఎన్నికలు ప్రజలకు, దొరలకు మధ్య జరుగుతున్న పోరాటమని టీపీసీసీ ప్రచార కమిటి చైర్మన్, మధిర తాజా మాజి శాసన సభ్యులు మల్లు భట్టివిక్రమార్క అభివర్ణించారు. ఆదివారం నియోజకవర్గంలోని ముదిగొండ మండలంలో ఎన్నికల ప్రచార ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలలో కెసిఆర్ దొర ప్రభుత్వాన్ని గద్దె దించి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. మధిర నియోజకవర్గ ప్రజలు ఆత్మగౌరవంతో జీవిస్తారని వారిని ఓట్లను డబ్బులు పెట్టి కొనలేరన్నారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేన్ని అర్హులందరికి డబుల్ బెడ్‌రూం ఇళ్ళు నిర్మించడంతోపాటు గతంలో ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించుకొన్నవారికి మరొ గది నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. నీళ్లు,నిధులు, నియామకాల కోసమే ఉద్యమకారులు తమ ప్రాణాలను ఫణంగా పెడితే ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో ధనికరాష్టన్న్రి దోచుకుతిన్నారని ఆరోపించారు. మధిరలో ఎటువంటి అభివృద్ధి చేయకుండా కేవలం అధికారం కోసమే టిఆర్‌ఎస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకకాలంలో రైతులకు రూ.2లక్షల ఋణమాఫీ చేయడంతోపాటు, నిరుద్యోగుల కోసం లక్ష ఉద్యోగాల నియమాకాలు చేపడతామన్నారు. నిరుద్యోగులకు రూ.3వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అభయహస్తం పెన్షన్ పధకాన్ని పునరుద్దరించడంతోపాటు, డ్వాక్రా గ్రూప్‌లకు రూ.10లక్షల వరకు వడ్డీ లేని ఋణాలను అందిస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ముదిగొండకు వచ్చిన భట్టివిక్రమార్కకు ఘనస్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి పసుపులేటి లక్ష్మి, జడ్‌పిటీసి మందరపు నాగేశ్వరరావు, నాయకులు కొమ్మినేని రమేష్‌బాబు, రాయల నాగేశ్వరరావు, వల్లూరి భధ్రారెడ్డి, మట్టా బాబురామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.