ఖమ్మం

విజయలక్ష్మి అలంకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, అక్టోబర్ 14: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా లక్ష్మితాయారు అమ్మవారు సోమవారం విజయలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. సకల విజయాలను సమకూర్చే తల్లిగా విజయలక్ష్మిని కొలుస్తారు. జ్ఞానేశ్వరి.. విజయప్రదా అని కీర్తిస్తారు పరాశుర భట్టార్. విజయం అంటే కేవలం యుద్ధ విజయం మాత్రమే కాదు. అన్ని రంగాల్లో కూడా విజయాన్ని ప్రసాదిస్తుంది. ఈ రూపంలో ఉన్న అమ్మను పూజిస్తే ఆయా రంగాల్లోని వారికి సునిశితమైన జ్ఞానాన్ని ప్రసాదించి, తద్వారా వారిని విజయులను చేస్తుంది.

ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయి
ఎర్రుపాలెం, అక్టోబర్ 14: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికలలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే టిఆర్‌ఎస్‌ను మరలా గెలిపిస్తాయని ఖమ్మం పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావులు పేర్కొన్నారు. ఆదివారం మండల పరిధిలోని రామన్నపాలెం నుండి మీనవోలు మీదుగా చొప్పకట్లపాలెం వరకు నిర్వహించిన బైక్ ర్యాలీని ప్రారంభించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాలలో ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా వారు టిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల వలన ప్రజలకు అనేక రకాల లబ్ధి చేకూరిందని తెలిపారు. మీనవోలులో జరిగిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గడచిన 51నెలలలోతెలంగాణ ప్రభుత్వం ప్రతి ఓక్క వర్గానికి చేసిన సేవలను యవత్ దేశం పరిశీలన చేస్తుందని అన్నారు. ఇంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పరిస్ధితి ఇప్పటి తెలంగాణ పరిస్ధితిని ప్రతి ఓక్కరు చూడాలన్నారు. కెసిఆర్ విజన్‌తో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళుతున్నారని అన్నారు. కెసిఆర్ ఎన్నికల మేనిపేస్టోలో చెప్పని అంశాలను కూడా అమలు చేసి ప్రజల అభిమానాన్ని పొందారని అన్నారు. టిఆర్‌యస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న లింగాల కమల్‌రాజును గెలిపించాలని అన్నారు. గతంలో ఇచ్చిన హమీ డబల్‌బెడ్‌రూం ఇళ్ళు ప్రభుత్వ భూములు లేక జాప్యం జరిగిన మాట వాస్తవమేనని అన్నారు. రెండు సార్లు స్వల్ప తేడాతో ఓడిపోయినా కూడా కమల్‌రాజు నియోజకవర్గంలోనే ప్రజల మద్యన ఉన్నారని ఆయనను ఆదరించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితికి 100 సీట్లు వస్తాయని అందులో మధిర మొదటిదని ధీమా వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో బొమ్మెర రామూర్తి, కమల్‌రాజు, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, చావా అరుణ, చావా రామకృష్ణ,గూడూరు రమణారెడ్డి,రంగిశెట్టి కోటేశ్వరరావు,వేమిరెడ్డి త్రీవేణి, బుర్రా నారాయణ, మూల్పూరి శ్రీనివాసరావు,మొగిలి అప్పారావు, పంబి సాంబశివరావు తదితరులు ఉన్నారు.