ఖమ్మం

సత్తుపల్లి కన్నా మిన్నగా పాలేరును తీర్చిదిద్దుతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం రూరల్, మే 6: అభివృద్ధిలో పాలేరు నియోజకవర్గాన్ని సత్తుపల్లికి తాతలా తీర్చిదిద్దుతానని పాలేరు నియోజకవర్గ టిఆర్‌ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన మండలంలోని సత్యనారాయణపురం, ఏదులాపురం, వరంగల్ క్రాస్‌రోడ్, మద్దులపల్లి, పొనె్నకల్లు, తల్లంపాడు గ్రామాలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయా గ్రామాలలో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పలువురు మహిళలు తుమ్మలకు నుదిటిపై తిలకందిద్ది హారతిచ్చి విజయం చేకూరాలని ఆశీర్వదించారు. ఈసందర్భంగా జరిగిన సభలలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా హామీలివ్వకుండానే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని ప్రజలకు చేరువయ్యేలా చేసిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌కే దక్కిందన్నారు. పాలేరు నియోజకం పట్ల పూర్తి అవగాహన ఉంది. ఈ ఎన్నికల్లో తనకు అఖండ విజయాన్ని చేకూర్చితే పాలేరు రూపురేఖలనే మార్చేస్తానని ఆయన స్పష్టం చేశారు. మంత్రిగా తాను ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్టు చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి సంక్షేమ కార్యక్రమం ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. భక్తరామదాసు ఎత్తిపోతల పథకాన్ని మరో మూడు, నాలుగు నెలల్లో పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడివుందన్నారు. రాష్ట్రంలో ఇంటింటికీ నల్లా పెట్టి తాగునీటిని సరఫరా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అలా చేయకపోతే తాను ఓట్లడిగేందుకు మీముందుకు రానని ఘంటాపథంగా చెప్పిన వ్యక్తి కెసిఆర్ అని అన్నారు. కెసిఆర్ ఇచ్చిన మాట తప్పరన్న విశ్వాసం ప్రజల్లో ఉందన్నారు. ఇతర పార్టీలపై నమ్మకం సన్నగిల్లి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలకు ఆకర్శితులై టిఆర్‌ఎస్ పార్టీలో అనేకమంది చేరుతున్నారు. రాష్ట్ర రవాణాశాఖామంత్రి పట్నం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానిని చేసి చూపిస్తుందన్నారు. రాష్ట్రంలో కరవులోనూ 24 గంటల కరెంట్ ఇస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్భ్రావృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు తనను ఈపార్టీవైపు ఆకర్షితున్నయ్యేలా చేశాయన్నారు. పాలేరులో తుమ్మల నాగేశ్వరరావును గెలిపించి ప్రభుత్వానికి మద్దతు తెలిపాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మద్ది మల్లారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ తదితర నాయకులు పాల్గొన్నారు.

*