ఖమ్మం

వనమా అభ్యర్థిత్వం ఖరారుతో కాంగ్రెస్‌లో ఉత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, నవంబర్ 13: కొత్తగూడెం నియోజక వర్గ కాంగ్రెస్ అభ్యిర్థిగా మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అభ్యర్థిత్వం ఖరారు కావటంతో కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగింది. కొత్తగూడెం నియోజక వర్గం నుంచి ఎన్నికల బరిలో కాంగ్రెస్ అభ్యర్ధిగా మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. 1989 నుంచి 1994వరకు కొత్తగూడెం శాసన సభ్యునిగా పని చేసిన వనమా వెంకటేశ్వరరావు ఆర్టీసి చైర్మన్‌గా సేవలందించారు. 1999 నుంచి 2004, 2004 నుంచి 2009 వరకు శాసన సభ్యునిగా, రాష్ట్ర వైద్యవిధానపరిషత్‌శాఖ మంత్రిగా పనిచేశారు. 2014లో మహాకూటమిలో తరపున సిపిఐకి చెందిన కూనంనేని సాంబశివరావుకు కొత్తగూడెం సీటును ఖరారు చేయటంతో కాంగ్రెస్‌లో కీలకపాత్ర పోషించిన వనమా వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ అభ్యర్ధిగా ఎన్నికల బరిలో నిలిచారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తిరిగి సొంత గూటికి చేరిన వనమా పార్టీ పటిష్టతకు చర్యలు చేపట్టారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఎన్నికల బరిలో నిలిచేందుకు కాంగ్రెస్ అధిష్టాన వర్గం టిక్కెట్‌ను ఖరారు చేసింది. కొత్తగూడెం నియోజక వర్గం నుంచి మహాకూటమి తరపున సిపిఐకి చెందిన మాజీ శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ, తెలంగాణ కాంగ్రెస్ కమిటీ సభ్యులు యడవల్లి కృష్ణ,సీటు కోసం తీవ్ర ప్రయత్నం చేసినప్పటికీ కాంగ్రెస్ అధిష్టాన వర్గం మాత్రం వనమా వెంకటేశ్వరరావు వైపే మొగ్గు చూపింది.
ఖమ్మం జిల్లాలో నాలుగు నామినేషన్లు
ఖమ్మం(మామిళ్ళగూడెం), నవంబర్ 13: జిల్లాలో నామినేషన్ల దాఖలు రెండవరోజైన మంగళవారం మొత్తం నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. ఖమ్మం నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా కొంకిమళ్ళ సాయికుమార్ తన అనునాయులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. వైరా నియోజకవర్గం నుండి సిపిఎం పార్టీకి చెందిన భూక్యా వీరభద్రం బిఎల్‌ఎఫ్ అభ్యర్థిగా నామినేషన్‌ను అధికారులకు అందజేశారు. ఈయన సోమవారం కూడా ఒక నామినేషన్ దాఖలు చేశారు. సిపిఎం పార్టీ నాయకులతో కలిసి ఆయన నామినేషన్‌ను అందజేశారు. పాలేరు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థిగా లోడిగ వెంకన్న నామినేషన్‌ను దాఖలు చేశారు. మధిర నియోజకవర్గం నుండి బిఎల్‌ఎఫ్ అభ్యర్థిగా కోటా రాంబాబు నామినేషన్ దాఖలు చేశారు. సిపిఎం పార్టీ జిల్లా మధిర నియోజకవర్గ నాయకులతో కలిసి ఆయన నామినేషన్‌ను వేశారు. జిల్లాలో మొత్తం మంగళవారం నాటికి మొత్తం ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. ఖమ్మం నియోజకవర్గం నుండి రెండు, వైరా నుండి రెండు, పాలేరు నుండి ఒక, మధిర నియోజకవర్గం నుండి ఒక నామినేషన్ దాఖలయ్యాయి.

మధిర బరిలో భట్టి
ఖమ్మం(మామిళ్ళగూడెం), నవంబర్ 13: మధిర నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టివిక్రమార్క పోటీ చేయనున్నారు. కొంతకాలంగా ఆయన ప్రచారం నిర్వహిస్తున్నప్పటికీ మహాకూటమి పొత్తుల్లో భాగంగా మధిర నియోజకవర్గంలో ఆయన తిరిగి పోటీ చేస్తారని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. కాంగ్రెస్ అగ్రనేతగా పనిచేసిన మల్లు అనంతరాములు సోదరునిగా రాజకీయరంగ ప్రవేశం చేసిన స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా పనిచేస్తూ ఆంధ్రాబ్యాంకు డైరెక్టర్‌గా సేవలందించారు. నియోజకవర్గాల పునర్విభజన తరువాత 2009లో మధిర నియోజకవర్గంలో పోటీచేసి గెలుపొందిన ఆయన 2014లో కూడా విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా పనిచేస్తున్న ఆయన 2009నుంచి డెప్యూటీ స్పీకర్‌గా కూడా పనిచేశారు. భట్టికి మద్దతుగా టిడిపి నేతలతో పాటు సినీనటి విజయశాంతి కూడా ఇప్పటికే ప్రచారం చేశారు. టిడిపి శాసన సభ్యుడు, సినీనటుడు నందమూరి బాలకృష్ణ కూడా ఈ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు.
ఎన్నికల అబ్జర్వర్స్‌తో సీపీ భేటీ
ఖమ్మం(క్రైం), నవంబర్ 13: డిసెంబర్ 7న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ఎక్స్‌పెండెచర్ అబ్జర్వర్స్ దైర్యషిల్ వి కానే్స, పంకజ్‌కుమార్ అధికారులతో మంగళవారం పోలీస్‌కమిషనర్ తఫ్సీర్‌ఇక్బాల్ తన కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు సంబందించిన అంశాలపై కూలంకషంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి ఎఆర్ శ్యాంసుందర్, స్పెషన్‌బ్రాంచ్ ఎసిపి సత్యనారాయణ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.