ఖమ్మం

ఎర్రజెండా పోరాటస్ఫూర్తిని నిలబెడదాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, నవంబర్ 13: రాష్ట్రంలో కమ్యూనిస్టు ఉద్యమానికి ఒక చరిత్ర ఉందని, నైజాంకు వ్యతిరేకంగా వెట్టిచాకిరి, భూమిహక్కు తదితర డిమాండ్ల సాధనకై పోరాడి 4 వేల మంది కమ్యూనిస్టులను పోగొట్టుకొని, 10లక్షల ఎకరాల పంపకానికి పూనుకున్న ఆనాటి ఎర్రజెండా పోరాటస్ఫూర్తిని నిలబెడదామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. మంగళవారం స్ధానిక సుందరయ్యభవన్‌లో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్ నాలుగేళ్ళ పాలనలో ప్రజలు ఎన్నో కష్టాలను ఎదురుచూశారని, ప్రజావ్యతిరేక పాలన సాగించిన టిఆర్‌ఎస్‌ను ఇంటికి పంపాల్సిందేనన్నారు. ఆ క్రమంలో ఏర్పాటైన బిఎల్‌ఎఫ్‌తో కలిసిరావాలని వామపక్షపార్టీలను ఆహ్వానించామన్నారు. బిఎల్‌ఎఫ్, టిమాస్ ఏర్పాటు విషయంలో సీపీఎం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుందని ఆరోపించడం సీపీఐకి సరైందికాదన్నారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని సమావేశాలకు సీపీఐని ఆహ్వానించామని, అనేక సమావేశాలకు సీపీఐ వచ్చిందని, ఏ అంశంపైన విభేదించలేదన్నారు. కేవలం టిఎర్‌ఎస్ ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్‌తో కలిసి పోవాలనే ఏకైక కారణంతో మాతో కలిసిరాలేదన్నారు. ఎంతో చరిత్ర కలిగిన సిపిఐ రాష్ట్రంలో 3 సీట్లకోసం కాంగ్రేస్‌తో పోవడం సరైందికాదన్నారు. కోందడరాం సార్, సిపిఐ ఇప్పటికైనా పునరాలోచనచేసి బిఎల్‌ఎఫ్‌తో కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు. గత 30 ఏళ్ళ నుండి ఇలాగే చేసి తట్టలో ఉన్న సంసారాన్ని బుట్టలోకి తెచ్చుకున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఒకపార్టీని ఓడించడానికి, మరో పార్టీతో జత కట్టడమే సిపిఎం ఈ పరిస్థితికి కారణమన్నారు. 72 ఏళ్ళ స్వతంత్ర దేశంలో పాలకులు మారారేతప్ప ప్రజల బ్రతుకులు మారలేదన్నారు. ఒక పార్టీ ఓడి, మరో పార్టీ గెలవడం ప్రత్యామ్నాయం కాదని, విధానాల ప్రత్యామ్నాయం కావాలన్నారు. అది బిఎల్‌ఎఫ్ ద్వారానే సాధ్యమని ఆయన అన్నారు. ఈ విలేఖర్ల సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు యర్రా శ్రీకాంత్ పాల్గొన్నారు.
నియోజకవర్గ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు
చండ్రుగొండ, నవంబర్ 13: కాంగ్రెస్, టీడీపీ పార్టీల నుండి పోటీచేసే అభ్యుర్థుల జాబితా సోమవారం రాత్రి వెలువడటంతో తెల్లవారేసరికే మండల రాజకీయాలలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వనమా వెంకటేశ్వరావుకు కొత్తగూడెం, నామా నాగేశ్వరావుకు ఖమ్మం అసెంబ్లీ స్థానాలు ఆయా పార్టీలు కేటాయించటంతో టిఆర్‌ఎస్‌లో తీవ్ర అసంతృప్తిగావున్న నేతలు వనమా, నామా వద్దకు మంగళవారం పరుగులు తీయటం మండలంలో చర్చనీయంగా మారింది. గత సార్వత్రిక ఎన్నికల అనంతరం మండలంలో పలుగ్రామాలలో ప్రజాబలంవున్న కాంగ్రెస్ , తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. చేరిననాటి నుండి ఆ నేతలు, కార్యకర్తలకు ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు నుండి ఆదరణ లేకపోవటంతో పాటు అవమానాలు ఎర్కొంటున్నట్లు పలువురు నాయకులు పలుమార్లు ఆవేదన చెందారు. గత రెండు సంవత్సరాల నుండి తాటి వెంకటేశ్వర్లు మండల పర్యటనకు వచ్చినా ముఖ్యనేతలెవరూ తాటి పర్యటనలో పాల్గొనలేదు. అదే విధంగా తాటి సైతం అసంతృప్తి నేతలను పట్టించుకోలేదు దీంతో తాటిపై అధిక సంఖ్యలోని నాయకులు, కార్యర్తలు తీవ్ర ఆగ్రహంతోవున్నట్లు ప్రచారం జరగుతోంది. తాటి గత నెలరోజులుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూన్నా ముఖ్యనేతలెవరు తాటి వెంకటేశ్వర్లవైపు కనె్నత్తి చూడలేదు. తాటి అసంతృప్తి నాయకులను కలిసే ప్రయత్నంచేసినా నేతలు ఆకాశం ఇవ్వలేదనే ప్రచారం జరగుతోంది. అవకాశం కోసం ఎదురుచూస్తున్న అసంతృప్తి నాయకులకు సమానమైన నాయకునికి టికెట్లు లభించటంతో మాజీ కాంగ్రెస్ నాయకులు వనమా వెంకటేశ్వరావుని, మాజీ టీడీపీ నాయకులు నామా నాగేశ్వరావుని కలసి తమ మద్దత్తు తెలిపారు. ఒక్కసారిగా మండలంలో జరిగిన రాజకీయ పరిణామాలకు నామ మాత్రంగా మిగిలిన టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలకు ఖంగుతిన్నట్లు ప్రచారం జరగుతుంది. ఇదిలావుండగా రాబోవే మూడువారల ప్రచారంలో అభివృద్ధిపై తాటిని నిలదీయాలని మహాకూటమిలోని ముఖ్యనేతలు వారి అనుచరలకు సూచించినట్టు పలుగ్రామాలలో ప్రచారం సాగుతోంది.