ఖమ్మం

భద్రాద్రి టిక్కెట్ పోడెం వీరయ్యకే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, నవంబర్ 13: భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మహాకూటమి అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి పొడెం వీరయ్యను రంగంలోకి దించారు. సోమవారం అర్థరాత్రి కాంగ్రెస్ తొలి జాబితాను విడుదల చేయగా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన భద్రాచలం అసెంబ్లీ టిక్కెట్ కాంగ్రెస్ తరుపున వీరయ్యకే దక్కింది. అంచనాలను తలకిందులు చేస్తూ వడపోతల అనంతరం కాంగ్రెస్ అధిష్టానం స్థానికేతరుడైన వీరయ్యను ఇక్కడకు పంపాలని నిర్ణయించింది. పొడెం వీరయ్య రాజకీయాల్లో రెండున్నర దశాబ్దాల నుంచి ఉన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మంగపేట మండలం తొండ్యాల లక్ష్మిపురం. తొలుత గిరిజన అభ్యుదయ సంఘానికి నాయకత్వం వహించిన వీరయ్య రాజకీయాల్లోకి కాలుమోపారు. 1999, 2004 ఎన్నికల్లో ములుగు అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో టీఆర్‌ఎస్ అభ్యర్థి చందులూల్ చేతిలో ఓటమి చవిచూశారు. ఆయన ప్రాథమిక విద్యభ్యాసం ములుగులో సాగగా ఎంఎ వరకు చదువుకున్నారు. ఈసారి కూడా ఆయన ములుగు అసెంబ్లీ స్థానం నుంచే పోటీ చేయడానికి ఆసక్తి కనబర్చారు. కానీ అక్కడ సీతక్క కాంగ్రెస్ తరుపున రంగంలోకి ఉండటంతో ఇద్దరి మధ్య పోటీ నెలకొంది. ఇదిలా ఉంటే భద్రాచలం టిక్కెట్‌ను స్థానికులకే ఇస్తారని భావించారంతా. అందుకు అనుగుణంగానే డివిజన్ కాంగ్రెస్ నేతలు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి ఇరువురు పేర్లు విన్నవించారు. కానీ టిక్కెట్ కేటాయింపులపై తీవ్ర తర్జనభర్జనల అనంతరం భద్రాచలం అసెంబ్లీ టిక్కెట్‌ను కాంగ్రెస్ పార్టీ వీరయ్యకు కేటాయించింది.

పార్టీల ఎన్నికల ఖర్చు అదుపునకు ప్రత్యేక వ్యవస్థ
* ఎన్నికల వ్యయ పరిశీలకులు గీతిష్‌కుమార్
భద్రాచలం టౌన్, నవంబర్ 13: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్న న్యాయ విరుద్ధమైన ఖర్చులను అదుపు చేసేందుకు భారత ఎన్నికల సంఘం ఎక్సపెండీచర్ మానిటర్ సిస్టమ్ ఏర్పాటు చేశారని భద్రాచలం, కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాల ఎన్నికల పరిశీలకులు గీతిష్‌కుమార్ తెలిపారు. భద్రాచలం శాసనసభ నియోజకవర్గ పర్యవేక్షకుడిగా మంగళవారం సబ్‌కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించారు. శాసనసభ నియోజకవర్గంలో ఎన్నికల విధులకు సంబంధించిన రిజిస్టర్లను ఈ సందర్భంగా పరిశీలించారు. అనంతరం రిటర్నింగ్ అధికారి భవేశ్‌మిశ్రా ఆధ్వర్యంలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అకౌంటింగ్ టీమ్, స్టాటిక్ సర్వేలైన్, వీడియా ఎవైలెన్స్, ఫ్లయింగ్‌స్క్వాడ్, ఎంసీసీ టీం, వీడియో వ్యూవింగ్ టీమ్‌లతో సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా ఎన్నికల విధుల్లో ఉన్న వివిధ బృందాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల వ్యయ పరిశీలనలో భాగంగా గత రెండురోజులుగా కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో తనిఖీలు నిర్వహించి ఎన్నికల విధుల్లో ఉన్న బృందాలతో సమీక్ష నిర్వహించానన్నారు. అంతకుముందు ఆయన చెక్‌పోస్టులను తనిఖీ చేశారు. సమావేశంలో రిటర్నింగ్ అధికారి భవేశ్‌మిశ్రా, ఏఎస్పీ సంగ్రామ్‌సింగ్‌పాటిల్, జిల్లా వ్యవసాయ కమిటీ నోడల్ అధికారి కృపాకర్, తహసిల్దార్ రమాదేవి, లైజినింగ్ అధికారి మరియన్న, ఎన్నికల విధులు నిర్వహించే బృందాలు పాల్గొన్నారు.