ఖమ్మం

మూడు స్థానాల్లో టీడీపీ పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, నవంబర్ 13: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ మూడు స్థానాల్లో పోటీ చేయనున్నది. ఈ మేరకు మహాకూటమిలో ఒప్పందం కుదిరింది. అందులో భాగంగా ఖమ్మం స్థానంలో నామ నాగేశ్వరరావు, సత్తుపల్లిలో సండ్ర వెంకటవీరయ్య, అశ్వారావుపేటలో మెచ్చా నాగేశ్వరరావు పోటీ చేయనున్నారు. సండ్ర వెంకటవీరయ్య ఇప్పటికే ప్రచారం చేస్తుండగా మిగిలిన ఇద్దరు నేతలు బుధవారం నుంచి ప్రచారంలో పాల్గొననున్నారు. వీరికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కూడా ప్రచారం చేస్తాడని ఆ పార్టీ నేతలు తెలిపారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీచేస్తున్న నామ నాగేశ్వరరావు ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యునిగా ఉన్నారు. ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా కురవి మండల పరిధిలోని బలపాల గ్రామానికి చెందిన ఈయన ఖమ్మం నగరంలోనే జీవిస్తున్నారు. మధుకాన్ సంస్థ అధిపతిగా ఉన్న నామ 2009ఎన్నికల్లో ఖమ్మం ఎంపిగా గెలుపొంది తెలుగుదేశం పార్టీ పార్లమెంటరి పార్టీ నేతగా పనిచేశారు. చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డ ఈయన గత ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. బుధవారం ఖమ్మంకు చేరుకోనున్న ఆయన అదే రోజు నుంచి ప్రచారాన్ని కూడా ప్రారంభించనున్నారు. సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీచేస్తున్న సండ్ర వెంకటవీరయ్య ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షునిగా ఉన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం రాజుపేటకు చెందిన ఆయన తొలుత సిపిఎం పార్టీలో పనిచేసి పాలేరు నియోజకవర్గంలో శాసన సభ్యునిగా కూడా ఎన్నికయ్యారు. ఆ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. నియోజకవర్గ పునర్విభజన తరువాత సత్తుపల్లిలో 2009లో, 2014లో టిడిపి అభ్యర్థిగా విజయం సాధించారు. ప్రస్తుతం కూడా ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగానే బరిలో నిలుస్తున్నారు. టిటిడి పాలక మండలి సభ్యునిగా గత ఆరేళ్ళుగా పనిచేస్తున్న ఆయన గత నెల రోజుల నుంచే ప్రచారం నిర్వహిస్తుండటం విశేషం. అశ్వారావుపేట నియోజకవర్గంలో పోటీ చేస్తున్న మెచ్చా నాగేశ్వరరావు అదే నియోజకవర్గ పరిధిలోని దమ్మపేట మండలానికి చెందిన వారు. మొదటి నుంచి తుమ్మల నాగేశ్వరరావుకి అత్యంత నమ్మకమైన అనుచరునిగా పనిచేసిన ఆయన తుమ్మలతో పాటు టిఆర్‌ఎస్‌లో చేరలేదు. గత ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇదే నియోజకవర్గంలో పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఈసారి కూడా తనకు టికెట్ కేటాయించడంతో మంగళవారం చంద్రబాబును అమరావతిలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ కూడా బలమైన క్యాడర్ కలిగి ఉండటంతో అందరిని కలుపుకొని పనిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

కొత్తగూడెం కాంగ్రెస్ అభ్యర్థిగా వనమా
* ఎట్టకేలకు జాబితాను ప్రకటించిన కాంగ్రెస్ * భద్రాద్రి జిల్లాలో ఇల్లందు మినహా అభ్యర్థుల ఖరారు
కొత్తగూడెం, నవంబర్ 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజక వర్గాలకు సంబంధించి నాలుగు నియోజక వర్గాల కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ అధిష్టాన వర్గం సోమవారం అర్ధరాత్రి ప్రకటించింది. కొత్తగూడెం నియోజక వర్గ కాంగ్రెస్ అభ్యర్ధిగా మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, పినపాక కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ శాసన సభ్యుడు రేగా కాంతారావు, భద్రాచలం నియోజక వర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే పొడెం వీరయ్యను ప్రకటించారు. ఇల్లందు నియోజ వర్గ అభ్యర్థిత్వాన్ని పెండింగ్‌లో పెట్టగా అశ్వారావుపేట మహాకూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీకి చెందిన మెచ్చా నాగేశ్వరరావు అభ్యర్థిత్వాన్ని ఖరారుచేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత నెల రోజులుగా మహాకూటమి అభ్యర్థుల జాబితా ప్రకటన కోసం కార్యకర్తలు ఆశగా ఎదురుచూశారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జన సమితి పార్టీలు మహాకూటమిగా ఏర్పడి సీట్ల పంపకానికి అధిష్టాన వర్గాలు తీవ్రంగా శ్రమించాయి. కొత్తగూడెం నియోజక వర్గ సీటు కోసం కాంగ్రెస్, సీపీఐలు గట్టి పట్టుపట్టడటంతో అధిష్టానం వర్గాలకు తలనొప్పిగా మారగా కార్యకర్తలకు ఉత్కంఠతను రేపింది. ఎట్టకేలకు కాంగ్రెస్ అధిష్టానం మహాకూటమి అభ్యర్ధుల జాబితాను విడుదల చేసింది. ఇల్లందు నియోజక వర్గ అభ్యర్ధి కోసం అన్ని ప్రధాన పార్టీలు ఆశిస్తుండటంతో ఆ సీటును పెండింగ్‌లో పెట్టారు. సీట్లు ప్రకటించినప్పటికీ మహాకూటమిలో విభేదాలు వీధినపడుతున్నాయి. కొత్తగూడెం సీటును టీడీపీకి కేటాయించకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తూ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు దిష్టిబొమ్మను ఆ పార్టీ కార్యకర్తలు కొత్తగూడెంలో దగ్ధం చేశారు. సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించిన సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సైతం మహాకూటమి అభ్యర్థులపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అసంతృప్తి నాయకులను బుజ్జగించే పనిలో అధిష్టానవర్గాలు ఉన్నాయి.