ఖమ్మం

గిరిజన విద్యాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ: పీఓ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, నవంబర్ 15: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని 20 దిశ ఆదర్శ గిరిజన ప్రాథమిక పాఠశాలల్లో గిరిజన విద్యాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు ఐటీడీఏ పీవో పమేలా సత్పతి తెలిపారు. భద్రాచలం మండలంలోని రాజుపేటలో ఉన్న గిరిజన ప్రాథమిక పాఠశాలను పీవో గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో గుణాత్మక విద్యను అందించడానికి గిరిజన సంక్షేమశాఖ ముమ్మర ప్రయత్నాలు చేస్తుందని, ఇప్పటికే రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ జిల్లా కలెక్టర్ సూచనలతో భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని గిరిజన ప్రాథమిక పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా రూపాంతరం చేసేందుకు చక చక పనులు చేస్తుందన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఆంగ్లంలో విద్యాబోధన నైపుణ్యాత్మకంగా ఉండాలని గిరిజన సంక్షేమశాఖ ఉద్దేశమన్నారు. గిరిజన ప్రాథమిక పాఠశాలలో పునాది స్థాయి నుంచి ఆంగ్లం ఉంటే విద్యార్థులు ఉన్నతంగా ఎదుగుతారన్నారు. అందులో భాగంగానే ఆదర్శ పాఠశాలల్లో వౌలిక వసతులైన తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, క్రీడా సామాగ్రి, ప్రహరీగోడ, పెన్షింగ్, ఇతర మరమ్మతుల కోసం ఒక్కొ పాఠశాలకు రూ.4లక్షలు కేటాయించామన్నారు. విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు ఇంజనీరింగ్ విభాగం, గిరిజన సంక్షేమ అధికారులతో తగు మార్పులు, చేర్పులు చేస్తున్నామని పీవో తెలిపారు. గిరిజన విద్యార్థులకు మంచి క్రమశిక్షణ, అలవాట్లు, సంప్రదాయాలు, కట్టుబాట్లు తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు ప్రహరీగోడలపై చిత్రాలు వేయిస్తామన్నారు. ఈ ప్రత్యేక ప్రాజెక్టును పకడ్బందీగా అమలు చేసేందుకు జిల్లా గిరిజన సంక్షేమశాఖ ఉపసంచాలకులు రామ్మూర్తి, ఏటీడీవోలు జహీరుద్దీన్, లక్ష్మణ్‌బాబు, సత్యనారాయణలు పనులు పర్యవేక్షించాలని ఆదేశించారు. భద్రాచలం ఏటీడీవో పరిధిలో 12, దమ్మపేటలో 5, ఇల్లందులో 3 కలిపి మొత్తం జిల్లాలో 20 దిశ ఆదర్శ పాఠశాలలుగా రూపాంతరం చేయనున్నట్లు పీవో వివరించారు.