ఖమ్మం

ఎడవల్లి గృహం వద్ద వనమా, ఎడవల్లి వర్గీయుల ఘర్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాల్వంచ, నవంబర్ 15: కొత్తగూడెం మహాకూటమి అభ్యర్ధి వనమా వెంకటేశ్వరరావు విజయానికి సహకరించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు వనమా రాఘవేంద్రరావు, రామకృష్ణ, పలువురు కాంగ్రెస్ నాయకులు గురువారం మాజీ టిపిసిసి సభ్యులు ఎడవల్లి కృష్ణను కలిసేందుకు మర్యాదపూర్వకంగా వెళ్లారు. అయితే నిన్న మొన్నటివరకు మహాకూటమి సీటు కోసం వనమాతో పాటు ఎడవల్లి కృష్ణ తన ప్రయత్నాలు చేసినప్పటికీ ఎడవల్లికి సీటు దక్కలేదు. దీంతో తన నాయకుడు ఎడవల్లి కృష్ణకు కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందంటూ ఆవేశంతో ఉన్న ఎడవల్లి కృష్ణ అనుచరులు ఎడవల్లిని కలిసేందుకు వెళ్లిన వనమా కుటుంబ సభ్యులను, కాంగ్రెస్ నాయకులను ఇంట్లోకి రానివ్వకుండా గేటు వద్దనే అడ్డుకున్నారు. కూటమి విజయానికి సహకరించాలని ముందస్తుగా ఎడవల్లి కృష్ణకు సమాచారం ఇచ్చి తామంతా ఇక్కడకు వచ్చామని ఎడవల్లి అనుచరులకి వనమా వర్గీయులు చెపుతున్నప్పటికీ కోపోద్రిక్తులుగా ఉన్న ఎడవల్లి కృష్ణతో పాటు ఆయన సతీమణి సుశీల, కుటుంబ సభ్యులు ససేమిరా వనమా రాఘవను, కాంగ్రెస్ నాయకులను ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుపడడంతో ఆందోళన తీవ్రతరమైంది. కాంగ్రెస్ పార్టీ ఎడవల్లి కృష్ణకు సీటు ఇవ్వకుండా మోసం చేసిందని, వనమానే ఇందుకు కారణమంటూ, వనమా కుటుంబ సభ్యులు తమపై దౌర్జన్యం చేసేందుకు ఇంటికి వచ్చారంటూ ఎడవల్లి సతీమణి సుశీల ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఎడవల్లి గృహం వద్ద ఉద్రిక్తత జరుగుతుందన్న విషయం తెలుసుకున్న పోలీసులు ఎడవల్లి గృహానికి చేరుకొని వనమా- ఎడవల్లి అనుచరులను, ఎడవల్లి కటుంబ సభ్యులతో మాట్లాడి ఆందోళన సద్దుమనిగేలా చేసారు.