ఖమ్మం

రెబల్స్‌గా పోట్ల, మానుకొండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, నవంబర్ 15: మహకూటమి అభ్యర్థుల ప్రకటన వెలువడిన మరుసటి రోజే టిక్కెట్ దక్కని ఆశావాహులు రెబల్స్‌గా నామినేషన్ వేస్తామని ప్రకటించారు. ప్రధానంగా ఖమ్మం నియోజకవర్గంలో కాంగ్రెస్ టిక్కెట్‌ను ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్ ఈ నెల 19న నామినేషన్ వేయనున్నట్లు వెల్లడించారు. రాధాకిషోర్ తన స్వగ్రామమైన ఖమ్మం అర్బన్ మండలం బాలపేట గ్రామంలో గురువారం తన అనుచరులు మద్దతుదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రాధాకిషోర్‌ను పట్టుకొని రోదించారు. చివరివరకు టిక్కెట్ ఇస్తామని ఆశపెట్టిన అధిష్టానం ఖమ్మం సీటును తెలుగుదేశం పార్టీకి కేటాయించటం దారుణమన్నారు. గత ఎన్నికల్లో ఖమ్మంలో కాంగ్రెస్ విజయం సాధించిందని, రాష్ట్రంలో సిట్టింగ్ స్థానాలను ఎక్కడ కాంగ్రెస్ ఎదుర్కొలేదని, కేవలం ఖమ్మం పైనే ఎందుకు వివక్షత చూపారో అర్ధం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలు, స్నేహితుల అభిప్రాయం మేరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగానే నామినేషన్ వేస్తానని, బిఫాం ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ రెబల్‌గా రంగంలో ఉంటానన్నారు. మరో నేత పోట్ల నాగేశ్వరరావు టిక్కెట్ ఇస్తామంటూ చెప్పిన నేతలు ఢిల్లీకి వచ్చిన తరువాత ఖమ్మంను తెలుగుదేశంకు కేటాయిస్తామని చెప్పి పాలేరు నియోజకవర్గంలో పోటీ చేయాలని అడిగారన్నారు. తాము సరే అన్నామని, కాని పాలేరుకు పీసీసీ అధినేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బంధువును బరిలో దింపారన్నారు. అందుకే తాను రెబల్‌గా ఈ నెల 19న నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు.
కాగా ఇరువురు నాయకులు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావటం, ఇద్దరు ఒకే ప్రాంతానికి చెందిన వారు కావటం, ఇద్దరి బంధువర్గం కూడా ఒక్కటే కావటం ప్రాధాన్యత సంతరించుకున్నది. ఇరువురు నేతలు బహిరంగంగానే రెబల్ అభ్యర్థులుగా నామినేషన్లు వేస్తామని ప్రకటించటంతో మహకూటమి అభ్యర్థి నామా నాగేశ్వరరావు వారిని బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటివరకు అభ్యర్థి కోసం వేచిచూసిన కాంగ్రెస్ నేతలు టిక్కెట్లు దక్కకపోవటం వర్గాలుగా విడిపోయి ఎవరికివారు భవిష్యత్తు ప్రణాళికను రూపొందించుకోవటం విశేషం.