ఖమ్మం

కాంగ్రెస్ నేతలకు బుజ్జగింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, నవంబర్ 16: ఖమ్మం శాసనసభ స్థానాన్ని తెలుగుదేశం పార్టీకి కేటాయించడంపై నిరసన వ్యక్తం చేసి రెబల్ అభ్యర్థులుగా నామినేషన్లు వేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ నేతలతో పాటు అసంతృప్తులుగా ఉన్న కాంగ్రెస్ నేతలను బుజ్జగించేందుకు మహాకూటమి అభ్యర్థి నామ నాగేశ్వరరావు స్వయంగా వారి ఇళ్ళకు వెళ్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి ఆయన మహాకూటమి అభ్యర్థుల ఇళ్ళకు వెళ్ళి పరిస్థితిని వివరించి వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. శుక్రవారం ఉదయమే కాంగ్రెస్ నేత, ఖమ్మం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్ ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాధాకిషోర్ రేణుకాచౌదరి నిర్ణయం మేరకు నడుచుకుంటామని వెల్లడించారు. కార్యకర్తలు మాత్రం ఆగ్రహంతో ఉన్నారని, వారి నిర్ణయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు.
5వ రోజు 13 నామినేషన్లు
* పాలేరు కాంగ్రెస్ అభ్యర్థిగా కందాల నామినేషన్
ఖమ్మం (మామిళ్ళగూడెం), నవంబర్ 16: ఎన్నికల నోటిఫికేషన్ ప్రారంభం నుండి ఐదవరోజైన శుక్రవారం జిల్లాలో మొత్తం 13 నామినేషన్లు దాఖలయ్యాయి. పాలేరు నియోజకవర్గంలో 4 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా కందాల ఉపేందర్‌రెడ్డి, ఇండిపెండెంట్లుగా సీమ రాంబాబు, ఇస్లావత్‌రాజేందర్, పిరమిడ్ పార్టీ అభ్యర్థిగా బాణాల పుల్లయ్యచారి నామినేషన్లు దాఖలు చేశారు. ఖమ్మం నియోజకవర్గంలో ఇండిపెండెంట్‌గా బానోత్ లక్ష్మణ్‌నాయక్, షేక్ జమీల్, వైరా నియోజకవర్గం నుండి స్వతంత్య్ర అభ్యర్థిగా మాలోత్ మంగీలాల్, బహుజన ముక్తి పార్టీ అభ్యర్థిగా లకావత్ నాగేశ్వరరావు, సిపిఎం అభ్యర్థిగా బానోత్ బాలాజి, సత్తుపల్లి నియోజకవర్గం నుండి సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసి అభ్యర్థిగా కంకణాల అర్జునరావు, సిపిఎం అభ్యర్థులుగా మాచర్ల భారతి, కొలికపోగు సర్వేశ్వరరావు,మధిర నియోజకవర్గ బిఎల్‌ఎఫ్ అభ్యర్థిగా కొమ్ము శ్రీనులు నామినేషన్లు దాఖలు చేశారు.