ఖమ్మం

ఖమ్మం సభ టీఆర్‌ఎస్ విజయానికి సంకేతం:తుమ్మల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, నవంబర్ 16: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఖమ్మంలో ఏర్పాటు చేసిన సభ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ గెలుపునకు సంకేతమని రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఖమ్మం అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. 19న కేసీఆర్ సభకు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించి మాట్లాడుతూ నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తరువాత జరుగుతున్న తొలి సభ ఖమ్మంలోనే నిర్వహించడం తమకు గర్వంగా ఉందని, ఈ సభ ద్వారా ప్రజాభిప్రాయాన్ని రాష్ట్రానికి తెలియజేస్తామన్నారు. కెసిఆర్ సభకు లక్షమందికి పైగా ప్రజలు హాజరవుతారని తాము అంచనా వేస్తున్నామని, ప్రజలంతా స్వచ్చందంగా తరలివస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం, పాలేరు రెండు నియోజకవర్గాల నుంచి మాత్రమే ప్రజలు వస్తారని, మరోసారి ఇతర ప్రాంతాల్లో కెసిఆర్ పర్యటన ఉంటుందని వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో రెండు విద్యుత్ ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం, ఖమ్మం బస్టాండ్, ఖమ్మంలో ఐటిపార్కు, రోడ్ల సుందరీకరణ, ఓవర్‌బ్రిడ్జిలు, డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ళు, ఆసరా పెన్షన్లు, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులు అందించామని, వీటిద్వారా లబ్ధిపొందిన వారంతా సభలో పాల్గొనేందుకు వస్తున్నారని వెల్లడించారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు కమర్తపు మురళీ, డిప్యూటీ మేయర్ బత్తుల మురళీ, నాయకులు నాగచెన్నారెడ్డి, సాదు రమేష్‌రెడ్డి పాల్గొన్నారు.
గార్లలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన కనకయ్య
గార్ల, నవంబర్ 16: టీఆర్‌ఎస్ ఇల్లెందు నియోజకవర్గ అభ్యర్థి, తాజామాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య శుక్రవారం మండల కేంద్రమైన గార్లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇల్లిల్లు తిరుగుతూ రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలను వివరించటంతో పాటు రాబోయే కాలంలో చేపట్టబోయే కార్యక్రమాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా స్థానిక నెహ్రూ సెంటరులో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధనయే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సాగిస్తున్న ఉద్యమానికి ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో ప్రజా ఉపయోగకరమైన పథకాలను ప్రవేశపెట్టి ప్రజల దరిచేర్చిన ఏకైక పార్టీ టిఆర్‌ఎస్ అని, రానున్న కాలంలో రాష్ట్రంతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి తనను ఆశీర్వాదించాలని కనకయ్య కోరారు.
పాన్ విక్రయించిన కనకయ్య
గార్ల ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో భాగంగా స్థానిక నెహ్రూ సెంటరులోని కిల్లీ షాపులో కిల్లీలు విక్రయించి ప్రజలు, కార్యకర్తలను ఆశ్చర్యానికి గురిచేశారు. పాన్‌షాపు యజమానిని అడిగి కిల్లీ ఎలా కట్టాలో తెలుసుకొని కిల్లీలు కట్టి విక్రయించారు. దీంతో ఆనందం పట్టలేని కార్యకర్తలు ఎగబడి కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు వడ్లమూడి దుర్గాప్రసాద్, ఇల్లెందు ఏఎంసి చైర్మన్ భూక్యా నాగేశ్వరరావు, ఎంపిపి మాలోతు వెంకట్‌లాల్, జడ్పీటిసి ఎద్దు మాధవి, ఇల్లెందు మున్సిపాల్టీ కో ఆప్షన్ సభ్యుడు మడత వెంకట్‌గౌడ్, మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు, ఆయా గ్రామపంచాయతీల మాజీ సర్పంచులు, పార్టీ అనుబంధ సంఘాలకు చెందిన మండల బాధ్యులు పాల్గొన్నారు.